February 24, 2025
SGSTV NEWS
CrimeTelangana

Crime News: ట్రాన్స్జెండర్ను ప్రేమించి.. తండ్రి సమాధి వద్ద సూసైడ్!


ట్రాన్స్జెండర్ ను ప్రేమించిన ఓ యువకుడు రెండు రోజుల కింద  తన  తండ్రి సమాధి వద్ద పురుగుల మందు తాగగా, చికిత్స పొందుతూ ఆసుపత్రిలో  మృతి చెందాడు.    ఈ ఘటన గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఈ వార్త చదవండి.

Crime News: ట్రాన్స్జెండర్ ను ప్రేమించిన ఓ యువకుడు రెండు రోజుల కింద  తన  తండ్రి సమాధి వద్ద పురుగుల మందు తాగగా, చికిత్స పొందుతూ ఆసుపత్రిలో  మృతి చెందాడు.  ఈ ఘటన గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. చింతలపేటకు చెందిన నవీన్ (25) అదే కాలనీలో ఉండే ట్రాన్స్జెండర్ ను ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.   ఏమైందో తెలియదు కానీ రెండు రోజుల కింద కాలనీ సమీపంలోని స్మశాన వాటికలో తన తండ్రి సమాధి దగ్గర పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు.  విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే కర్నూల్ ఆసుపత్రికి తరలించారు.  అక్కడ నవీన్ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం చనిపోయాడు. ఇదిలా ఉంటే నవీన్ పార్ట్స్ వద్ద తీవ్ర గాయాలు కనిపించడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాన్స్ జెండర్స్ దాడి చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. కాగా  ఏడాది కింద నవీన్ తండ్రి ఆంజనేయులు యాక్సిడెంట్ లో చనిపోగా, ఇప్పుడు నవీన్ సూసైడ్ చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నవీన్ సూసైడ్ పై ఎలాంటి కంప్లైంట్ రాలేదని టౌన్ ఎస్సై కల్యాణ్ కుమార్ వెల్లడించారు.

గురుకులంలో టెన్త్ స్టూడెంట్ సూసైడ్
గురుకులంలో ఉంటున్న ఓ పదో తరగతి విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నాగర్  కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.  వెల్దండ మండలంలో చొక్కన్నపల్లి గ్రామానికి చెందిన కొమ్ము రమేశ్, రజిత దంపతుల కూతురు ఆరాధ్య (16) గత ఐదేండ్లుగా బాలానగర్ లోని బాలికల గురుకులంలో ఉంటోంది. ప్రస్తుతం ఆమె పదో తరగతి చదువుతోది. గురువారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో  విద్యార్థులు నిద్ర లేచిచూడగా ఆరాధ్య ఉరివేసుకొని కనిపించింది. వెంటనే వార్డెన్ , ప్రిన్సిపాల్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హాస్టల్ కు చేరుకొని వివరాలు సేకరించిన అనంతరం ఆరాధ్య డెడ్ బాడీని షాద్ నగర్ హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు న్నట్లు బాలానగర్ ఎస్సై లెనిన్ చెప్పారు. కాగా స్టూడెంట్ ఆత్మహత్యకు కారణాలు తెలియ రాలేదు.  బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుథెడ్డి బాలిక కుటుంబ సభ్యులకు రూ.50వేలు ఆర్థికసాయం అందజేశారు. 

Also read

Related posts

Share via