భార్య షాపింగ్ చేస్తుందని భర్త షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా సుపారీ ఇచ్చి భార్యను అంతమొందించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
ప్రస్తుత రోజుల్లో చిన్న చిన్న కారణాలతో దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎంతో అన్యోన్యంగా జీవించాల్సిన భార్యాభర్తలు క్షణికావేశంతో జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. ఇటీవల సోషల్ మీడియా పచ్చని కాపురాల్లో చిచ్చు రగిలిస్తున్నది. భార్య రీల్స్ చేస్తుందని కడతేర్చిన భర్తలు ఉన్నారు. అందంగా ముస్తాబవుతుందని అంతమొందించిన కిరాతకులు కూడా ఉన్నారు. స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వినియోగిస్తున్నదని.. ఎక్కువగా కాల్స్ మాట్లాడుతున్నదని ప్రాణాలు తీసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా ఓ భార్య షాపింగ్ ఎక్కువగా చేస్తుందని సుపారీ ఇచ్చి మరి చంపించాడు ఆమే భర్త. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
మధ్య ప్రదేశ్ కు చెందిన అజయ్ తన భార్య అతిగా షాపింగ్ కు ఖర్చు చేస్తుందని దుర్గావతిని సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. అయితే ఈ విషయం బయట పడకుండా మాస్టర్ ప్లాన్ వేశాడు. యాక్సిడెంట్ ప్రమాదంలో చనిపోయిందని పోలీసులను నమ్మించాడు. కానీ పోలీసుల తమదైన స్టైల్లో విచారణ చేపట్టే సరికి అసలు నిజం వెలుగు చూసింది. భార్యను హత్య చేసేందుకు భర్త రూ.2.5 లక్షలకు బేరం కుదుర్చుకుని కళ్ల ముందే భార్యను స్నేహితుడి చేతిలో హత్య చేయించినట్లు సమాచారం. అయితే పోలీసుల విచారణలో అజయ్ కి దుర్గావతి రెండో భార్య అని తెలిసింది. 2017 సంవత్సరంలో ఇరువురు పరిచయమ్యారు. పరిచయం కాస్త ప్రేమగా మారింది.
అయితే 2021లో దుర్గావతి వేరే పెళ్లి చేసుకుంది. అజయ్ కూడా 2022లో పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరూ తమ తమ జీవితాల్లో బిజీగా మారారు. కానీ అజయ్ వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత, దుర్గావతి తన భర్తకు విడాకులు ఇచ్చి తన ఇంటికి తిరిగి వచ్చింది. మరోసారి దుర్గావతి, అజయ్ దగ్గరయ్యారు. ఇరువురు 2023లో వివాహం చేసుకున్నారు. అయితే దుర్గావతి షాపింగ్ కు, ఇతరత్రావాటికి అతిగా ఖర్చు చేస్తుందని కోపంతో 2.5 లక్షలు ఇచ్చి భార్యను అంతమొందించాడు.
Also read
- చెంబులో ‘కీ’… అదే కలిసొచ్చింది దొంగలకి
- ఫేస్ బుక్ లో వల.. సహజీవనం తర్వాత అసలు రంగు!
- భర్త కువైట్‌లో.. భార్య కడపలో.. డ్రైవర్‌తో అలా కనిపించే సరికి..
- విశాఖ ప్రమాద బాధితులకు కోటిరూపాయల పరిహారం ఇవ్వాలి…… గ్రీష్మ కుమార్ ఐ.యఫ్.టీ.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..





