నాగర్కర్నూల్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. మూడు నెలల బాలుడు నీటి తొట్టిలో శవమై కనిపించడం కలకలం రేపింది. బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో ఈ తీవ్ర విషాదం వెలుగులోకి వచ్చింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన దంపతుల మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో మూడు నెలల బాబుని తీసుకుని తల్లిగారి ఇంటి దగ్గరకు వచ్చింది నీలమ్మ. దీంతో భర్త అమెను తీసుకువెళ్లేందుకు పాలెం గ్రామానికి వచ్చాడు. అయితే భార్యాభర్తల మధ్య విభేదాల గురించి మాట్లాడడానికి ఇరు కుటుంబాలు శుక్రవారం (ఫిబ్రవరి 27) పంచాయితీకి వచ్చాయి. పంచాయితీ ఎటూ తేలకపోవడంతో ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు.
అయితే అర్ధరాత్రి సమయంలో తల్లి ఒడిలో ఉండాల్సిన బాలుడు కనపించకుండా పోయాడు. దీంతో కంగారుపడ్డ నీలమ్మ బాబు ఆచూకీ కోసం వెతుకుతుండగా నీటి తొట్టిలో బాబు మృతదేహం లభ్యం అయ్యింది. బాబు మృతికి తండ్రే కారణమని తల్లి, ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బిజినేపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also read
- నవరాత్రి : దుర్గాదేవి సింహంపై ఎందుకు స్వారీ చేస్తుంది? మహిషాసురుడి యుద్ధం వెనుక రహస్యం ఇదే!
- నవరాత్రి : దుర్గాపూజలో అరటిచెట్టుకు పెళ్లికూతురిలా అలంకారం.. కోలాబౌ వెనుక ఉన్న రహస్యం ఇదే!
- దుర్గాదేవి చేతిలోని దివ్య ఆయుధాల వెనుక రహస్యం ఇదే.. ఒక్కో ఆయుధం ప్రత్యేకత తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- మద్యం మత్తులో తడబడ్డాడు.. సెకన్లలో బావిలో ఉన్నాడు..





