ఈజీ మనీకోసం అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు ఎంతకైన తెగించేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని సందర్భంగాల్లో అయితే ఏకంగా దేవున్నే టార్గెట్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే కడప జిల్లాలో వెలుగు చూసింది. దండం పెట్టి దీవించమని కోరాల్సిన గుడిలోకే దూరి చోరికి యత్నించారు. ఎంత శ్రమించినా ఫలితం లేకపోవడంతో చివరకు ఖాళీ చేతులతోపే పారిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా రాజంపేట మండలం వెంకటరాజంపేటలో కనకదుర్గమ్మ ఆలయం ఉంది. అయితే ఈ ఆలయంపై కన్నీసిన ఇద్దరు కేటుగాళ్లు గుడిలో ఉన్న హుండీని కాజేయాలి అనుకున్నారు.
దీంతో పక్కా ప్లాన్ వేసుకొని శనివారం రాత్రి సాధారణ భక్తుల రూపంలో ఆలయంలోకి ప్రవేశించారు. కాసేపు అటూ ఇటూ తిరుగి ఎవరు లేరని గమనించిన తర్వాత.. గర్భగుడి ముందు ఉన్న హుండీని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఎంత ట్రై చేసినా హుండీ రాకవపోడంతో దాన్ని మొత్తం తవ్వి హుండీని ఎత్తుకెళ్లాలి అనుకున్నారు. అందుకోసం మళ్లీ ప్రయత్నించారు. అయినా ఎలాంటి లాభం లేకపోవడంతో అసలిపోయి.. చివరికి అక్కడి నుంచి పారిపోయారు.
ఈ తతంగం మొత్తం గుడిలో ఉన్న సీసీ కెమెరాలొ రికార్డ్ అయ్యింది. మరుసటి రోజు ఈ దృశ్యాలను గమనించిన ఆలయ సిబ్బంది వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఇక గ్రామానికి రక్షగా ఉండే అమ్మవారి ఆలయంలోనే చోరి యత్నం జరగడం స్థానికంగా కలకలం రేపింది. ఆలయంలో ఇలాంటి చర్యలు జరుగకుండా పోలీసులు గస్తీ పెంచాలని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా గట్టి చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ చేస్తున్నారు.
Also read
- Garuda Purana : అమ్మ కడుపులో ఉన్నప్పుడే నరకం మొదలైపోతుందా, గరుడ పురాణం ఏం చెబుతోంది
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!





