విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణను లాకప్ డెత్ చేసినట్డు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు సిట్ అధికారులు. మృతదేహాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చూసినట్టు ఎస్సై వాగ్మూలం ఇచ్చారని సిట్ అధికారులు తెలిపారు.
విజయవాడలో తీవ్ర సంచలనంగా మారిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు కీలక విషయాలను ప్రస్తావించారు. సాయికృష్ణను లాకప్ డెత్ చేసినట్డు రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ అధికారులు పేర్కొన్నారు. మృతదేహాన్ని కృష్ణలంక పోలీస్ స్డేషన్ లో చూసినట్టు ఎస్సై వాంగ్మూలం ఇచ్చారని.. సాక్షాలను నాశనం చేయడానికి , పోలీసు కష్టడీలో లేకుండా పోవడానికి సీఐ నాగరాజే కారణమ రాసుకొచ్చారు. సీసీ ఫుటేజ్ డేటా డీవీఆర్ లో లేకుండా చేశారని రిమాండ్‌రిపోర్టులో సిట్ అధికారులు ప్రస్తావించారు.
సాయికృష్ణ మరణించాడని తెలిసినా కూడా కృష్ణలంక పోలీస్ సిబ్బంది ఆ సమాచారం మెజిస్ట్రేట్ కు చేరవేయలేదని, సాయికృష్ణ మరణించాడని తల్లి స్టేషన్ కు వెళితే సీఐ నాగరాజు దూషించాడని రిమాండ్‌రిపోర్ట్‌లో సిట్ పేర్కొంది.హైకోర్టులో సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ వేసినా కూడా కోర్ట్ ముందు వాస్తవాలను వెల్లడించలేదని.. హైకోర్ట్ ముందు కూడా నిజాలు దాచి, కోర్ట్ ను తప్పుదోవ పట్టించారని స్పష్టం చేసింది.
ఈ పరిణామాలన్ని గమనించాక సైంటిఫిక్ ఎవిడెన్స్ చెరిపివేయడం ద్వారా సాయికృష్ణను మరణించడని గుర్తించామని.. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఆదారాలు పూర్తిగా ద్వంశం చేశారని..ఈ అన్ని అంశాలు తెలుసుకోవాలంటే నిందుతుడైన నాగరాజును విచారించాల్సి ఉందని సిట్ అధికారులు తెలిపారు.02.06.2026 కంటే ముందే సాయికృష్ణ మరణించాడని తాము విశ్వస్తున్నామని.. కస్టడీలో ఉండగా గాయాలపాలై మరణించాడని అన్ని ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయని తెలిపారు.
Also read
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





