సాయికృష్ణ లాకప్ డెత్ కేసు విచారణ ఎంతవరకు వచ్చింది…? పరారీలో ఉన్న కానిస్టేబుల్స్ సంగతేంటి…? సాయికృష్ణ తల్లి విజయలక్ష్మీ మరోసారి హైకోర్టును కోరుతున్నదేంటి…? సిట్ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది..? పూర్తి డీటేల్స్ ఈ కథనంలో తెలుసుకుందాం పదండి . .. ..
ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఐ నాగరాజు మిత్రుడు సురేష్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీఐ నాగరాజుకు సురేష్ సహకరించినట్టు గుర్తించిన అధికారులు… లాకప్ డెత్ తర్వాత పరిణామాలపై ప్రశ్నిస్తున్నారు. పోలీసుల విధుల్లో సురేష్ జోక్యం.. నాగరాజుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు కేసులో కీలకంగా భావిస్తున్న పరారీలో ఉన్న కానిస్టేబుళ్ల కోసం కూడా ముమ్మర గాలింపు కొనసాగుతోంది. సెంట్రల్ డివిజన్ టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన సెట్… అనుమానితుల కోసం హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు కూడా టీమ్స్‌ని పంపింది. మరీ ముఖ్యంగా పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టింది.
ఇటు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తన న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. తన కుమారుడి లాకప్‌డెత్ కేసు దర్యాప్తు బాధ్యతలను స్థానిక పోలీసుల నుంచి తప్పించి సీబీఐ అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. CI నాగరాజు అరెస్ట్ కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే అంటూ ఆరోపించారు. దోషులను శాశ్వతంగా తప్పించాలన్నదే పోలీసుల ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుందన్నారు. ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. ఇక విజయలక్ష్మి పిటిషన్‌పై ఎల్లుంటి విచారణ జరపనుంది ఏపీ హైకోర్టు.
సాయికృష్ణ కేసులో సస్పెండైన సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ కీలక అంశాలు ప్రస్తావించింది. సాయికృష్ణను లాకప్ డెత్ చేసినట్డు రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ స్పష్టం చేసింది. లాకప్‌డెత్‌ను దాచేందుకు సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేశారని.. మృతదేహాన్ని పూడ్చిపెట్టడమో, తగలబెట్టడమో చేసేందుకు ప్రయత్నించారు. మృతదేహం ఇంకా లభించలేదని.. ఏం చేశారనే దానిపై దర్యాప్తు చేయాల్సి ఉందని కూడా సిట్ వివరించింది.
Also read
- Telangana: ఆహ్లాదంగా ఉండే గోదావరి తీరంలో.. ఉదయాన్నే భయానక దృశ్యం..
- స్నాప్‌లో పులిహోర కలిపి అమ్మాయిలను రూమ్‌కి పిలుస్తాడు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్..
- Kurnool: స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకుల్ని ఆపిన పోలీసులు.. తనిఖీ చేయగా
- Kurnool: బైక్ పోయిందని వ్యక్తి ఫిర్యాదు.. పోలీసులు దర్యాప్తు చేయగా..
- Andhra: అయ్యో.. బుజ్జమ్మ.. అప్పడే నూరేళ్లు నిండిపోయాయా..?





