SGSTV NEWS
Andhra PradeshCrime

చూడ్డానికి అమాయకుడిలా ఉన్నాడు.. కానీ మాములోడు కాదు.. అతని చేసిన పనులు తెలిస్తే..



ఆస్తి ముందు రక్త సంబంధాలు కూడా దిగదిడుపే అయ్యాయి. తోడబుట్టిన చెల్లినే కాదు కన్నవారిని కడుపున పుట్టిన వారికి కిరాతకంగా కడతేర్చాడు కసాయి వాడు. ఆస్తి అడిగినా.. డబ్బులు ఇవ్వమన్నా ఎక్కడ లేని కోపంతో సొంతవారినే ముట్టబెట్టాడు. వరసగా జరుగుతున్న హత్యల్లో అతని ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక సారి జైలుకెళ్లి వచ్చిన అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. కన్న కొడుకునే చంపి పాతిపెట్టిన ఘటనలో మరోసారి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.


రోజురోజుకు మనుషుల్లో డబ్బు పిచ్చి పెరిగిపోతుంది. డబ్బుపై మీద ఉన్న పిచ్చితో కొందరు వ్యక్తులు రక్త సంబంధాలనే దూరం చేసుకుంటున్నారు. డబ్బుకోసం కొందరు కన్న వారిరే కడతేర్చుతుంటే మరికొందరు తొడబుట్టిన వాళ్లనే హతమార్చుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది. ఆస్తి కోసం ఓ వ్యక్తం ఏకంగా తల్లిదండ్రులతో పాటు, తొడబుట్టిన వారిని, కడుపునపుట్టిన వారిని సైతం హతమర్చాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే… పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పుట్లగూడెంకు చెందిన వెంకటేశ్వర నాయక్ చూడటానికి అందరిలానే ఉంటాడు. తన పని తాను చేసుకుంటున్నట్లు బిల్డప్ ఇస్తాడు. అయితే అతనిలో ఉన్న సైకో ఎప్పుడు బయటికొస్తాడో ఎవరిని హతమారుస్తాడో ఎవరూ చెప్పలేని పరిస్తితి.

గొర్రెలు, మేకలను కాస్తు జీవనం సాగిస్తున్న వెంకటేశ్వర నాయక్‌కు పుట్లగూడెంలో ఎనిమిది ఎకరాల పొలం ఉంది. ఇరవై ఏళ్ల క్రితం వెంకటేశ్వర నాయక్ కు కోటేశ్వరి అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. మొదటి సంతానం మంగ్యా నాయక్ కాగా.. రెండో సారి పుట్టిన బిడ్డను రంగు తక్కువుగా ఉందని చంపేశాడు. ఈ విషయంలో వెంకటేశ్వర నాయక్‌తో ఘర్షణ పడిన కోటేశ్వరి అతని వద్ద నుండి వెళ్లిపోయింది. అయితే మంగ్యా నాయక్‌ను తండ్రే పెంచుకుంటున్నాడు. పది రోజుల క్రితం క్రోసూరు మండలం ఎర్రబాలెంలో మేకలను మేపుకునేందుకు వెళ్లిన తండ్రి కొడుకులు మధ్య విబేధాలు వచ్చాయి. తనకి తెలియకుండా మేకను మంగ్యా నాయక్ అమ్ముకోవడంతో తండ్రి కొడుకుతో ఘర్షణ పడ్డాడు. ఈ ఘర్షణలోనే వెంకటేశ్వర్ తన కొడుకును చంపేశాడు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా దాచిపెట్టాడు.

అయితే కొన్ని రోజులుగా మంగ్యా నాయక్ కనిపించకపోవడంతో తల్లి కోటేశ్వరికి అనుమానం వచ్చింది. దీంతో ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. తన కొడుకు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో భర్త వెంకటేశ్వర్ నాయక్‌పై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంకటేశ్వర నాయక్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. కొడుకును పాతి పెట్టిన ఘటనా స్థలానికి పోలీసులు వెంకటేశ్వర నాయక్‌ను తీసుకురాగా మంగ్యా నాయక్ బంధువులు అతనిపై దాడి చేశారు. అదే సమయంలో వెంకటేశ్వర నాయక్ సైకో ప్రవర్తన బయటపడింది.

కోటేశ్వరి వెళ్లిపోయిన తర్వాత వెంకటేశ్వర నాయక్ మరోవివాహం చేసుకున్నాడు. రెండో వివాహ చేసుకున్న తర్వాత.. మానసిక పరిస్థితి సరిగా లేని అతని చెల్లెలు కనిపించకుండా పోయింది. అయితే ఆమె అద్రుశ్యం అవ్వటం వెనుక కొడుడు వెంకటేశ్వర్‌ పాత్రే ఉందని భావించిన అతని తల్లి.. ఎనిమిది ఎకరాల్లో కొంత చెల్లెలు పేరున రాస్తానని కొడుకుతో గొడవకు దిగింది. దీంతో తల్లిపై కోపం పెంచుకున్న వెంకటేశ్వర్ ఆమెను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఆ తర్వాత కొంతకాలానికే తండ్రి బాలూ నాయక్ ను చంపేశాడు. తండ్రి హత్య కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.

అయితే జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత నాయక్‌లో మార్పు వచ్చిందని అందరూ భావించారు. అయితే మొదటి భార్య కొడుకు ఆస్తి కావాలని అడగటం, తనకు తెలియకుండా పశు సంపదను అమ్మడంతో మరోసారి వెంకటేశ్వర నాయక్ లోని సైకో బయటకొచ్చాడు. కన్న వారినే కాదు కడుపున పుట్టిన వారిని వదిలి పెట్టని వెంకటేశ్వర నాయక్ ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also read

Related posts

Share this