SGSTV NEWS online
Andhra PradeshCrime

వాడు మనిషి కాదు మృగం.. ఇంటి పక్కనే ఉంటూ.. మదనపల్లె బాలిక పోస్టుమార్టంలో సంచలన నిజం



అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విషాదం నెలకొంది. మదనపల్లిలో 7 ఏళ్ల బాలిక హత్య సంచలనంగా మారింది. అదృశ్యమైన బాలిక హత్యకు గురికావడంతో కలకలం రేకెత్తించింది. బాలికను హత్య చేసి డ్రమ్ములో దాచిన హంతకుడు అదే ప్రాంతానికి చెందిన కులవర్ధన్‌గా అనుమానిస్తున్న స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మదనపల్లి నీరుగట్టువారిపల్లిలోని కట్లాటపల్లి రోడ్డులో ఈ ఘటన జరిగింది. నీరుగట్టువారిపల్లికి చెందిన 7 ఏళ్ల మైనర్ బాలిక నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో పరిసరాల్లో వెతికిన తల్లిదండ్రులు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై మదనపల్లి 1 టౌన్ పీఎస్‌లో మిస్సింగ్ కేసు కూడా నమోదు అయ్యింది.

నీరుగుట్టవారిపల్లిలో అంతటా వెతికినా ఆచూకీ లభించకపోగా సీసీ ఫుటేజ్‌లోనూ పోలీసులు మైనర్ బాలిక మిస్సింగ్‌ను గుర్తించలేకపోయారు. ఆ ప్రాంతం నుంచి మైనర్ బాలిక బయటకు రాలేదని నిర్ధారించుకున్న పోలీసులు స్థానికంగా అనుమానం ఉన్న ప్రతి చోటా వెతికారు. ఇందులో భాగంగానే అదే కాలనీలో మైనర్ బాలిక ఇంటి వెనుక ఉన్న కులవర్ధన్ అనే యువకుడిపై అనుమానం వచ్చి వెతికారు. బాలికను హత్య చేసి డ్రమ్ములో కుక్కి దాచినట్లుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు కులవర్ధనేనని అనుమానించారు. ఉదయం నుంచి నీరుగుట్టవారిపల్లిలో కొనసాగుతున్న ఉద్రిక్తత రాత్రి 9 గంటల దాకా కొనసాగింది.

నిందితుడు కులవర్ధన్ ఇంటిని స్థానికులు ముట్టడించారు. స్థానికులు, కుటుంబసభ్యులు కులవర్ధన్‌ను అప్పగిస్తే తప్ప డెడ్ బాడీని అప్పగించమన్నారు. ఘటనా స్థలానికి రాయచోటి డీఎస్పీతో పాటు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నా డెడ్ బాడీ ఉన్న ఇంటిలోకి మాత్రం వెళ్ళలేకపోయారు. మరోవైపు ఎంబిటి రోడ్డును దిగ్బంధం చేసిన మైనర్ బాలిక తల్లిదండ్రులు స్థానికులతో కలిసి వాజ్‌పేయి విగ్రహం వద్ద బైఠాయించడంతో గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మైనర్ బాలికను హతమార్చిన నిందితుడిని అప్పగించాలని డిమాండ్ చేస్తూ చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో ఇంటిలోనే మైనర్ బాలిక మృతదేహం ఉండిపోగా.. ఇంటిలోకి పోలీసులను, క్లూస్ టీంను వెళ్లకుండా అడ్డుకుంటున్న స్థానికుల ఆందోళన ఉగ్రరూపం దాల్చింది. దీంతో కడప ఎస్పీతో పాటు మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటన స్థలానికి చేరుకోగా నిందితుడు కులవర్ధన్‌ను ఎన్ కౌంటర్ చేయాలని పట్టుపట్టారు. కడప ఎస్పీ, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి నిందితున్ని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చినా స్థానికులు సహకరించని పరిస్థితి ఏర్పడింది. చిన్నారి తండ్రి గోపీనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడిన హోం మంత్రి అనిత న్యాయం చేస్తామని హామీ కూడా ఇచ్చింది. నిందితుడికి ఉరిశిక్ష పడేలా చూస్తామని, సహకరించాలని అనిత కోరింది.


మరోవైపు అసెంబ్లీ నుంచే మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా స్పందించారు. చిన్నారిని హత్య చేసిన కులవర్ధన్ కు ఉరిశిక్షపడేలా చూస్తామని, కుటుంబీకులకు న్యాయం చేస్తామన్న ఎమ్మెల్యే షాజహాన్ భాషా భరోసా ఇచ్చారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించే ప్రయత్నం పోలీసులు చేసిన ప్రతిఘటన ఎదురు కావడంతో కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ ఘటన స్థలానికి చేరుకున్నారు. MBT రోడ్డులో ఆందోళనకు దిగిన మైనర్ బాలిక తల్లిని ఇంటి వద్దకు తరలించిన పోలీసులు.. ఎట్టకేలకు మైనర్ బాలిక డెడ్ బాడీ ఉన్న ఇంట్లోకి ప్రవేశించారు. ఇంటి తలుపులను పగలగొట్టి ఇంట్లోకి ఇచ్చారు. కడప ఎస్పీతో పాటు సబ్ కలెక్టర్ మైనర్ బాలిక తల్లిదండ్రులు, క్లూస్ టీం సిబ్బంది ఇంట్లోకి వెళ్లారు. నీరుగట్టువారిపల్లిలో దాదాపు 11 గంటలుగా ఉద్రిక్తత కొనసాగగా.. బాలిక మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మైనర్ బాలిక డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించగా.. ఆసుపత్రి వద్దే ఉన్న డీఐజీ కోయ ప్రవీణ్, కడప ఎస్పీ విశ్వనాథ్, సబ్ కలెక్టర్ కళ్యాణి పరిస్థితి సమీక్షించారు.

https://youtu.be/ABCzA0Fw6oQ?si=gCjWr6pSQRwVeISH 



ఉదయం నుంచి కుటుంబ సభ్యులను, స్థానికులను సముదాయించామన్న డీఐజీ కోయ ప్రవీణ్ పరిస్థితి అదుపు తప్పకుండా చేసామన్నారు. మైనర్ బాలిక డెడ్ బాడీకి పోస్టుమార్టం పూర్తి అయ్యాక మీడియాతో మాట్లాడారు. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. మృతదేహాన్ని వీరబల్లి మండలం రాగిమాను దిన్నెకు తరలించగా.. పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం రేప్ అండ్ మర్డర్ జరిగిందన్నారు డీఐజీ కోయ ప్రవీణ్. నిందితుడు పరారీలో ఉన్నాడని.. గాలింపు చర్యలు చేపట్టామన్నారు. బాలికను అత్యాచారం చేసి నీటిలో ముంచి చంపాడన్నారు. ఆధారాలు సేకరిస్తామన్నారు. నిందితుడిపై అత్యాచారం, హత్య, ఫోక్సో కేసు నమోదు చేశామన్నారు డీఐజీ కోయ ప్రవీణ్.

Also read

Related posts