Hyderabad Crime: హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ పార్టీ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. గోల్కొండలోని తారామతి బారాదరి రిసార్టులో రాత్రి ఓ ప్రైవేట్ ఈవెంట్ జరిగింది. పోలీసులు అనుమతి ఇవ్వకుండా పార్టీ నిర్వహించడంపై అధికారులకు అనుమానం వచ్చింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణ ఈగల్ టీమ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. పార్టీకి వచ్చినవారిని చెకప్ చేయగా ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది.
గొల్కొండలో తారామతి బారాదరి రిసార్ట్
హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ పార్టీ వ్యవహారాలు గుట్టుగా సాగుతున్నాయి. తాజాగా గోల్కొండలోని తారామతి బారాదరి రిసార్టులో శనివారం రాత్రి మోర్ దెన్ ఫ్రెండ్స్ పేరుతో ఓ ప్రైవేట్ ఈవెంట్ జరిగింది. ఈ పార్టీకి అనుమతి ఇవ్వలేదు. అయినా సరే పార్టీ ఈవెంట్ నిర్వహించింది సదరు సంస్థ. దీంతో అధికారులకు అనుమానం రావడంతో ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. తెలంగాణ ఈగల్ టీమ్ వెంటనే తనిఖీలు చేపట్టింది.
మొత్తం 200 మందికిపైగా హాజరైనట్టు సమాచారం. ఎవరూ పారిపోయేందుకు అవకాశం లేకుండా చుట్టు ముట్టింది ఈగల్ టీమ్. దాదాపు 36 మందిని డ్రగ్స్ కిట్లతో పరీక్షించారు అధికారులు. అందులో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పార్టీలో డ్రగ్స్ కలకలం, వెలుగులోకి కొత్త విషయాలు
పాజిటివ్ వచ్చినవారిలో పరం నిహార్, ఆశి, యోగేశ్వర్, అబ్దుల్ సర్వర్, జాసన్లతోపాటు ఓ యువతి ఉన్నట్లు తెలిపారు పోలీసులు. కేవలం మద్యం కోసం ఎక్సెజ్ అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. సదరు ఈవెంటు పోలీసుల పర్మిషన్ తీసుకోలేదట నిర్వాహకుడు చంద్ర. ఈ పార్టీ వెనుక ఉన్నది ఎవరు? ఎందుకు అనుమతి తీసుకోలేదు? దీని వెనుక ఎవరు ఉన్నారు? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
కొన్నాళ్లుగా తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ వ్యవహారంపై నిఘా పెట్టింది పోలీసు శాఖ. పార్టీల పేరుతో కొంతమంది విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫామహౌస్లు, రిసార్ట్స్్ప దృష్టి సారించారు. తెలంగాణ టూరిజానికి చెందిన రిసార్ట్‌లో ప్రైవేటు పార్టీ నిర్వహించడం వెనుక తీగ లాగే ప్రయత్నం చేస్తున్నారు దర్యాప్తు అధికారులు.
Also read
- మరణానంతరం గరుడ పురాణం ఎందుకు చదువుతారు? 13 రోజుల పారాయణం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
- Mysterious Temple: ఈ ఆలయంలో దెయ్యాలకు శిక్ష పడుతుందట..! ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్తే ఏమవుతుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- కృష్ణాజిల్లాలో విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల ఆత్మహత్య
- నా కొడుకు శవమైనా ఇవ్వండి





