కోరంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కౌలు రైతులు
తాళ్లరేవు (కాకినాడ) : తాళ్ళరేవు మండలం పటవల గ్రామంలో ఒక పశువుల పాక, ధాన్యం రాసులు దగ్ధమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అగ్ని ప్రమాదం ఆదివారం అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకున్నట్లు బాధిత రైతులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. పటవల నుండి మంజేరు వెళ్లే దారిలో రోడ్డుపక్క కౌలు రైతు మేడిశెట్టి రాంబాబు, పశువుల పాక ఉంది. అక్కడే 5 ఎకరాల పంట కోసి, నూర్చి రాశులుగా వేశారు. దాని పక్కనే మరో రైతు కోట మాణిక్యం ఎకరం పొలంలోని ధాన్యం రాశి ఉంది. ఆదివారం అర్ధరాత్రి అవి దగ్ధమై మంటలు వ్యాపించడంతో అటుగా వెళ్తున్న ఓ పండ్ల వ్యాపారి విషయాన్ని రైతులకు చేర వేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. అప్పటికే పశువుల పాక పూర్తిగా దగ్ధమైపోగా ధ్యానం రాసులు చాలావరకు కాలి బూడిద అయ్యాయి. దీంతో బాధిత రైతులు కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ఇలా అగ్గిపాలవడంతో రైతులు ఆవేదన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం అందించి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకున్నారు. కోరంగి పోలీస్ స్టేషన్లో బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. వీరికి అండగా కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు, పటవల మాజీ సర్పంచ్ కాల సూరిబాబు, టిడిపి నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, మందాల గంగ సూర్యనారాయణ, నడింపల్లి వినోద్, దంగేటి అప్పన్న, పలువురు కౌలు రైతులు అండగా నిలిచారు
Also read
- చెంబులో ‘కీ’… అదే కలిసొచ్చింది దొంగలకి
- ఫేస్ బుక్ లో వల.. సహజీవనం తర్వాత అసలు రంగు!
- భర్త కువైట్‌లో.. భార్య కడపలో.. డ్రైవర్‌తో అలా కనిపించే సరికి..
- విశాఖ ప్రమాద బాధితులకు కోటిరూపాయల పరిహారం ఇవ్వాలి…… గ్రీష్మ కుమార్ ఐ.యఫ్.టీ.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..





