ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో మల్లం బ్రహ్మోత్సవాలు విషాదంగా మారాయి. చిట్టమూరు మండలం మల్లంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో వేడి సాంబార్ మీద పడటంతో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో ఉత్సవ ప్రాంగణంలో తీవ్ర కలకలం రేగింది. బ్రహ్మోత్సవాలకు భక్తులు, నిర్వాహకులు పెద్ద సంఖ్యలో హాజరైన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. భోజన ఏర్పాట్లలో భాగంగా ఉంచిన వేడి సాంబార్ పాత్ర వద్ద ప్రమాదవశాత్తు కొందరిపై వేడి సాంబార్ పడటంతో తీవ్ర కాలిన గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, నిర్వాహకులు స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. దీంతో మెరుగైన వైద్యం కోసం వారిని చెన్నైకి తరలించినట్లు తెలుస్తోంది. మిగిలిన బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.
అయితే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Also read
- Tulsi Vastu: డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పక తెలుసుకోండి!
- Sanatana Dharma: దేవుడి గదిలోకి వెళ్లే ముందు స్నానం తప్పనిసరా? మన సంప్రదాయం ఏం చెబుతుందంటే..
- గురువారం అరటి చెట్టును ఎందుకు పూజించాలి? దీని వెనుకున్న రహస్యం తెలుసా?
- నేటి జాతకములు..8 అక్టోబర్, 2026
- Medak: ఫోన్‌పే బాక్స్ రిపేర్ చేస్తానంటూ మోసం.. క్షణాల్లో వేలు మాయం





