పల్నాడు జిల్లా ఈపూరు మండలం బద్రుపాలెం వద్ద దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి .. బతికుండగానే కన్న తండ్రిని కాలువలో పడేసిన ఘటన కలకలం రేపింది.
ఈపూరు: పల్నాడు జిల్లా ఈపూరు మండలం బద్రుపాలెం
వద్ద దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బతికుండగానే కన్న తండ్రిని కాలువలో పడేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజెండ్లకు చెందిన గంగినేని వెంకటేశ్వర్లు తన తండ్రి కొండయ్య(85)ను కారులో తీసుకొచ్చి బద్రుపాలెం వంతెనపై నుంచి సాగర్ కాలువలో పడేశాడు.
ఈ ఘటన చూసిన గ్రామస్థులు వృద్ధుడిని కాపాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వృద్ధుడిని కాలువలో పడేసిన అనంతరం కారులో పరారవుతున్న వెంకటేశ్వర్లును గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారమందించారు. పోస్టుమార్టం నిమిత్తం కొండయ్య మృతదేహాన్ని వినుకొండ ఆసుపత్రికి తరలించారు. వినుకొండ గ్రామీణ సీఐ ప్రభాకర్, ఈపూరు ఎస్సై ఉమా మహేశ్వర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
Also read
- బ్రహ్మపుత్ర నదిలో పడి జమ్మలమడుగు యువతి మృతి
- కళ్లల్లో కారం చల్లి… కత్తులతో నరికి… RMP డాక్టర్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..!
- Video: రీల్స్‌తో వివాదం.. రాజీనామా చేసిన ప్రభుత్వ టీచర్! కన్నీళ్లు పెట్టుకుంటూ..
- ఇంకా దొరకని రాము.. నీతు.. గుండెల్ని పిండేస్తున్న ఘటన..
- Massive Scam: 70 మందికి టోకరా పెట్టిన రిటైర్డ్ టీచర్.. ఏకంగా ఏడు కోట్లు స్వాహా





