గుంటూరు మెడికల్ కాలేజీలో మెడికల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ నెల 4న మంత్రి సత్యకుమార్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. మెడికల్ ఎగ్జిబిషన్ కావడంతో విద్యార్ధులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి తిలకిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో విజయవాడకు చెందిన నర్సింగ్ విద్యార్ధులు నలుగురు వచ్చారు. ఎగ్జిబిషన్ తిలకించిన తర్వాత మైక్రోబయోలజీ వద్ద ఏర్పాటు చేసి ఫీడ్ బ్యాక్ బోర్డ్ వద్ద ఆగారు. స్లిప్స్‌పై తమ అభిప్రాయాలను తెలిపి వాటిని బోర్డుపై ఉంచే క్రమంలో ఒక విద్యార్థి బూమ్ అంటూ రాసి బోర్డుపై పెట్టారు. దీన్ని చదవడంలో పొరబడిన ఎగ్జిబిషన్ సిబ్బంది బాంబుగా భావించి హాడావుడి చేశారు. వెంటనే మెడికల్ కాలేజ్ గేట్లు మూసివేశారు. ఎగ్జిబిషన్ నుండి అందరిని బయటకు పంపారు. ఈ క్రమంలోనే ఆ స్లిప్ పెట్టింది ఎవరా అంటూ సిసి కెమెరా విజువల్స్ తీశారు. పోలీసులుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చే లోపు ఆ విద్యార్ధులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇక ఈ విషయంపై మీడియా ఎగ్జిబిషన్ నిర్వాహకుడు అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను ప్రశ్నించారు. బాంబు బెదిరింపు నిజమా..? కాదా..? చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మీడియా వ్యక్తులకు అసిస్టెంట్ ప్రొఫెసర్ మధ్య వాగ్వివాదం జరిగింది. మరోవైపు పోలీసులు ఆ విద్యార్థులును ప్రశ్నించగా.. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం తాము బూమ్ అని రాశామ.. అది బాంబ్ కాదంటూ వివరణ ఇచ్చారు. వాళ్లు రాసిన స్లిప్‌ను పరిశీలించిన పోలీసులు అందులో కూడా బూమ్ అనే ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ బాంబు వార్త మాత్రం ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది.
Also Read
- మరణానంతరం ఆత్మ 13 రోజులు కుటుంబంతోనే ఉంటుందా? గరుడ పురాణం చెప్పే నిజం ఏమిటి?
- Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలకు చెక్..!
- లక్షకు రూ.30 వేల వడ్డీ.. రూ.25 కోట్లు వసూల్.. ఈ కిలాడి జంట చేసిన పని తెలిస్తే నోరెళ్లబెడతారు..
- ఐపీఎల్ క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న కిలాడీలు.. అసలు వీరు వాడిన టెక్నిక్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆ పక్కనే కనిపించిన సూసైడ్ నోట్.. ఓపెన్ చేయగా..





