సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం, మల్కాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలను హత్య చేసి.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అయితే భార్య తమను వదిలేసిపోయిందన్న మనస్తాపంతోనే అతని ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలను హత్య చేసి.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం, మల్కాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మల్కాపూర్ గ్రామానికి చెందిన సుభాష్‌కు కొన్నెళ్ల క్రితం పెళ్లి జరిగింది. అతని ప్రస్తుతం మారిన్ (13), ఆరాధ్య (10) అనే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగా భార్య కొన్ని రోజుల క్రితం వాళ్లను వదిలేసి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. అయితే భార్యత తమను వదిలి వెళ్లిపోవడాన్ని సుభాష్ జీర్ణించుకోలేక పోయాడు. దీంతో మస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఇక మొదటగా తన ఇద్దరు కుమార్తెలను ఇంట్లోనే ఉరివేసి హత్య చేశాడు. ఆ తర్వాత తానూ కూడా ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇక ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి
Also read
- నకిలీ వధూవరుల ఫొటోలతో భారీ స్కామ్.. నిధులు ఎలా స్వాహా చేశారంటే..
- అరేయ్ ఇలా ఉన్నారేంట్రా.. బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. కట్ చేస్తే, ఊరు చివర పొదల్లో..
- పోస్ట్ డెలవరీ డిప్రెషన్‌తో మహిళ ఆత్మహత్య? 6వ అంతస్తు నుంచి శిశువుతో దూకి..
- ఫ్రీగా బంగారాన్ని మెరిపిస్తామంటూ మాయ చేశారు! ఒంటరి మహిళను టార్గెట్ చేసి..
- నాగరాజును నమ్మింది.. నట్టేట మునిగింది.. ఏకంగా రాష్ట్రం దాటి వచ్చి..





