విశాఖ నకిలీ బ్లాక్ కరెన్సీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. అతను నుంచి కారు, 10సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు రిమాండ్‌కి తరలించారు.
కలకలం సృష్టించిన నకిలీ బ్లాక్ కరెన్సీ కేసులో కీలక నిండితుడిని విశాఖ పట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకు తిరుగుతున్న ప్రధాన నిందితుడు అబ్దుల్ గని అలియాస్ గని రాజును ఎట్టకేలకు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. అతని దగ్గర నుంచి కారు, 10సెల్ ఫోన్‌లను సీజ్ చేశారు.
ఫిబ్రవరి 20న విశాఖ కాకానినగర్‌లోని ఓ ట్రావెల్స్ కార్యాలయంలో ఇద్దరు వ్యక్తుల వద్ద బ్లాక్ కరెన్సీ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడి చేశారు. విశాఖకు చెందిన కోసుంపూరి వెంకట కన కదుర్గరాజు అలియాస్ భాస్కరరావు, పశ్చిమ గోదావరి జిల్లా యండగండికి చెందిన మద్దాల శ్రీనివాసరావులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3 కోట్ల విలువైన మూడు బ్యాగుల్లో బ్లాక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించి దీనికి సూత్రధారి గనిరాజు అని గుర్తించారు.
ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన విశాఖ పోలీసలు గనిరాజుకోసం గాలిస్తున్నారు. శుక్రవారం కాకానినగర్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో ఉన్న గనిరాజును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడిని విచారించగా నల్లటి రంగు పూసిన కాగితాలను రసాయనంలో ముంచితే అసలు కరెన్సీగా మారుతుందని నమ్మించి మోసానికి పాల్పడుతున్నట్లు తెలిపాడు.
కాకినాడ జిల్లా పెనుమర్తి ప్రాంతానికి చెందిన గనిరాజు.. పదేళ్ల క్రితమే దొంగ నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి కూడా దొంగనోట్ల వ్యవహారం సాగిస్తు్న్నాడు. చివరికి పోలీసులు పన్నిన వలలో చేప పిల్లలా చిక్కిపోయాడు. గనిరాజును అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





