చిప్పగిరి (కర్నూలు) : సరైన పంటలు రాక పెట్టిన పెట్టుబడులన్నీ కూడా చేతికి రాక చేసిన అప్పులు ఎక్కువవ్వడంతో గత్యంతరం లేక రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గత రాత్రి మండల పరిధిలోని బంటన హాల్ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, పోలీసులు వివరాల మేరకు… నీలమ్మ, సుంకన్న లకు పెద్ద కొడుకు అయిన నాగరాజు (40) పొలాలను కౌలుకు తీసుకొని పండించేవాడని, గత రెండు సంవత్సరాల నుంచి సరైన పంటలు చేతికి రాక పెట్టిన పెట్టుబడులన్నీ కూడా చేతికి అందక, చేసిన అప్పులు కూడా ఎక్కువ కావడంతో ప్రతిరోజు తీవ్ర మనోవేదన కు గురయ్యేవాడు. అప్పులు తీర్చలేమనే ఉద్దేశంతో గత రాత్రి పురుగుమందు తీసుకొని పొలాల్లోకి వెళ్లి తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. గుంతకల్లులో రైతు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మఅతునికి భార్య ఒక కూతురు ఉన్నారని, ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామ పెద్దలు సర్పంచ్ కోరారు. పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025