వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు బాంబు పార్సిల్ పంపడంతో అది పేలి భర్త, కుమార్తె మరణించిన ఘటన గుజరాత్ లోని వడాలిలో గురువారం చోటుచేసుకుంది.
గాంధీ నగర్: ఓ వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు బాంబు పార్సిల్ పంపడంతో అది పేలి భర్త, కుమార్తె మరణించిన ఘటన గుజరాత్‌లోని వడాలిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీతూభాయ్ హీరాభాయ్ వంజారా(32) అనే వ్యక్తి కుటుంబంతో సహా వడాలిలో నివసిస్తూ.. కూలి పని చేసుకుంటూ జీవితం సాగిస్తున్నారు. గురువారం వారి ఇంటికి టేప్ రికార్డర్ వంటి పరికరం పార్సిల్ రావడంతో దానిని తీసుకున్న జీతూభాయ్, అతని కుమార్తె భూమిక(12) ఆన్ చేయడానికి ప్రయత్నించగా అది పేలింది. ఈ ప్రమాదంలో జీతూభాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన భూమికను స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె కూడా మృతి చెందింది. మరో ఇద్దరు కుమార్తెలకు గాయాలవడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు అతడి భార్య ఇంట్లో లేకపోవడంపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఇంటికి ప్యాకేజీని డెలివరీ చేసిన రిక్షా డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వాంగ్మూలం ఆధారంగా నిందితుడు జయంతిభాయ్ బాలుసింగ్ వంజారా (31) ను అరెస్టు చేశామన్నారు. అతడు రాజస్థాన్‌కు వెళ్లి బాంబు తయారీకి అవసరమైన పదార్థాలు కొనుగోలు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. టేప్ రికార్డర్ ప్లగ్ ఆన్ చేసిన వెంటనే అది పేలేలా బాంబును రూపొందించాడని వారు పేర్కొన్నారు. తన ప్రియురాలిని జీతూభాయ్ వివాహం చేసుకున్నాడనే కారణంతోనే అతడిని హత్య చేయడానికి నిర్ణయించుకున్నానని నిందితుడు తెలిపాడు.
Also read
- Telangana: అయ్యో దేవుడా.. పెళ్లైనా 6 నెలలకే ఇంత దారుణమా.. శాడిస్ట్ భర్త వేధింపులతో..
- Delhi Blast: కారు ఓనర్ పుల్వామా నివాసి.. ఢిల్లీ పేలుడు కేసులో సంచలన విషయాలు..
- Delhi Blast: అల్ ఫలా యూనివర్సిటీ నీడలో టెర్రరిస్టులు.. మొత్తం ఆరుగురు డాక్టర్లు అరెస్ట్!
- ఢిల్లీ కారు పేలుడు కేసులో కీలక పురోగతి.. డాక్టర్లుగా పని చేస్తూ.Delhi blast Latest updates
- Delhi Blast: ఎర్రకోట దగ్గర పార్కింగ్‌లో 3 గంటలు వెయిటింగ్.. ఆ సూసైడ్ బాంబర్ ఇతనే..





