హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో పోస్ట్ చేసి అరెస్టయిన ఐదుగురు కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీపీసీసీ సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, నవీన్, ఆస్మా తస్లీమ్, గీతలకు కోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చింది.
పది వేల పూచీకత్తుతో కూడిన రెండు ష్యూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిందితులు ప్రతీ సోమ, శుక్ర వారాలు కేసు విచారణ అధికారుల ముందు హాజరుకావాలని కోరింది.
కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు ఐదుగురు వాట్సాప్లో వచ్చిన అమిత్ షా మార్ఫింగ్ వీడియోలను కావాలనే ట్విటర్లో పోస్టు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలన్న ఉద్దేశంతో ఇలాంటి వీడియోలు పోస్టు చేసినట్లు ప్రాథమికంగా తేలినందున ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
Also read
- ఓర్నీ దుంపదెగ.. SIR వెరిఫికేషన్ పేరిట వచ్చి పుస్తెల తాడు తెంపుకుపోయిండ్రు!
- Ananthagiri Hills: అనంతగిరిలో ట్రెక్కింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ.. ఆ తర్వాత నిమిషాల్లోనే..
- భాగ్య, హన్నమ్మ మామూలు లేడీస్ కాదమ్మ.. బస్టాండ్లో వాళ్ల కంట పడ్డారో అంతే సంగతులు..
- కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి బావను చంపిన బావమరిది..! క్రైమ్ స్టోరీని మించిన స్కెచ్..
- ఆరు హత్యకేసుల నిందితుడు రాజ్ కుమార్ మృతి





