హైదరాబాద్‌లో పెళ్లైన 7రోజులకే నవ వధువు మౌనికను బీజేపీ నేత గురజాల అరవింద్ ఎత్తుకెళ్లడం కలకలం రేపుతోంది. ఇప్పటికే పెళ్లైన అరవింద్ పై కాలనీ వాసులు మండిపడుతూ అతని చిత్రపటానికి చెప్పుల దండేసి నిరసన తెలిపారు. మౌనిక మాత్రం ఇష్టపూర్వకంగానే వెళ్లానంటోంది.
BJP Leader love case: హైదరాబాద్‌లో నవ వధువు మిస్సింగ్ కేసు కలకలం రేపుతోంది. పెళ్లయిన 7 రోజులకే నవ వధువు మౌనికను గోల్కొండకు చెందిన బీజేపీ నేత గురజాల అరవింద్ ఎత్తుకెళ్లడం రాష్ట్రంలో ఉత్కంఠ రేపుతోంది. అత్తాపూర్‌కు చెందిన శివరామకృష్ణతో ఇష్టం లేకపోయినా తలవంచి తాళి కట్టించుకున్న మౌనిక.. మూడు రోజుల కిందట తన ప్రియుడు అరవింద్‌తో కలిసి లేచిపోయింది. దీంతో మౌనిక కుటుంబసభ్యులు నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు
చిత్రపటానికి చెప్పుల దండ..
దీంతో కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అరవింద్‌కు ఇదివరకే పెళ్లి అయిందని, ఒక పాప కూడా ఉందని వెల్లడించారు. అయితే మౌనికతో ఎఫైర్ పెట్టుకున్న బీజేపీ నేత అరవింద్ నిర్వాకంపై కాలనీ వాసులు మండిపడుతున్నారు. అరవింద్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. కానీ మౌనిక మాత్రం తను ఇష్టపూర్వకంగానే అరవింద్‌తో వెళ్లానని, అతనితోనే ఉంటానని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది
గోల్కొండ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు గురజాల అరవింద్(46) లంగర్ హౌస్ గొల్లబస్తీలో ఉండే యువతితో కొన్నేండ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే మూడు రోజుల కింద బండ్లగూడ సమీపంలోని ఆర మైసమ్మ ఆలయం వద్దకు ఆమెను రమ్మని తీసుకుని పారిపోయాడని పోలీసులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025