తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రధమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యచేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది.
రాజానగరం, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యచేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. రాజానగరం సీఐ ఎస్. ప్రసన్న వీరయ్యగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం నర్సాపురానికి చెందిన పరుచూరి ప్రగతి (19) ఇక్కడి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. సోమవారం నుంచి రెండవ సెమిస్టర్‌కు సంబంధించిన తరగతులు ప్రారంభంకావడంతో ప్రగతి స్వగ్రామం నుంచి ఆదివారమే కళాశాల వసతిగృహానికి చేరుకుంది. సోమవారం ఉదయం పక్కగదిలో ఉన్న స్నేహితులు తరగతులకు వెళ్లగా విద్యార్థిని వెళ్లలేదు. గదిలోంచి బయటికి కనిపించకుండా దుప్పటి అడ్డుగా ఏర్పాటుచేసుకుని, బట్టలు అరేసుకునే హుక్కుకు చున్నీ బిగించుకుని ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలో ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. మొదటి సెమిస్టర్లో నాలుగు పరీక్షలు ఉత్తీర్ణత కాలేదని.. మానసికంగా చాలా ఆందోళన చెందుతున్నానని, తల్లిదండ్రులను జాగ్రత్తగా ఉండమని అందులో ఆమె పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ వై.శ్రీకాంత్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు వ్యవసాయకూలీలైన సూర్యప్రకాశ్, భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కుమార్తె ప్రవల్లిక బీటెక్ పూర్తిచేసింది. ప్రగతి మనస్తాపంతో మృతిచెందడంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.
Also read
- చంద్రిక నన్ను క్షమించు.. నీకు ఇచ్చిన మాట తప్పాను
- Andhra News: నిత్యం తాగొచ్చిన తల్లిని వేధిస్తున్న తండ్రి.. తల్లి బాధ చూడలేక కొడుకు ఏం చేశాడంటే?
- Warangal: అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. వాటిని కాజేసేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Chittoor: తాగునీటిని పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులు.. అక్కడ కనిపించిన సీన్ చూడగానే..
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..