గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన మహిళా అఘోరాను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేస్తున్నట్లు సమాచారం. అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో గత కొన్ని రోజులుగా లేడీ అఘోరీ తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ లో కొండగట్టు, వేములవాడ రాజన్న, కీసర ఆలయాలను ఆమె సందర్శించారు. ఒంటిపై దుస్తులు లేకుండా.. విభూది రాసుకుని సంచరిస్తున్న ఆ అఘోరిని చూసి అంతా షాక్ అయ్యారు. ఇటీవల సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ ఆలయంపై దాడి జరిగిన సమయంలో ఆమె మళ్లీ అక్కడ ప్రత్యక్ష్యమయ్యారు. అక్కడ ఒంటికాలిపై నిలబడి పూజలు చేశారు. అప్పటి నుంచి మీడియా, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం అయ్యారు.
వరుసగా ఇంటర్వ్యూలు..
అనంతరం మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. తాను శవాలను తింటానని, ఆత్మలతో మాట్లాడతానని చెబుతున్నారు. అయితే.. అనేక మంది ఆమె తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు సైతం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కీసర పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజంగానే ఆమె అఘోరాగా మారారా? లేక జనాలను మోసం చేస్తోందా? అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే.. పోలీసులు మాత్రం ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ట్రాన్స్ జెండర్..
అయితే ఆమె అఘోరీ కాదు ట్రాన్స్ జెండర్ అంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఆమె అబద్ధాలు చెబుతోందని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ అఘోరీ తాను కాలుతున్న శవాల నుంచి మాసం తీసుకుని తింటానని చెప్పడంతో దుమారం మొదలైంది. ఇది నేరమని అనేక మంది పోస్టులు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ అఘోరీని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెతే ఆమె నిజంగానే అఘోరీనా? లేక జనాలను మోసం చేయడానికి ఇలా చెబుతుందా? అన్నది మరికొన్ని రోజుల్లో తేలే అవకాశం ఉంది.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





