కర్నూలు జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన కామ దహనం కార్యక్రమంపై భక్తులు మండిపడుతున్నారు. మన్మధుడితోపాటు ఆయన వాహనమైన రామ చిలుకను దహనం చేయడాన్ని హిందూ సంఘాలు తప్పు పడుతున్నాయి
AP News: కర్నూలు జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో అపచారం జరిగింది. దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన కామ దహనం కార్యక్రమంపై భక్తులు మండిపడుతున్నారు. మన్మధుడితోపాటు ఆయన వాహనమైన రామ చిలుకను దహనం చేయడాన్ని హిందూ సంఘాలు తప్పు పడుతున్నాయి. రాష్ట్ర పక్షిగా గుర్తింపు పొందిన రామ చిలుక దహనంపై హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
రామ చిలుక దహణంపై శ్రీశైలం దేవస్థానం అర్చకులు, ఆలయ అధికారులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. హిందూ సమాజానికీ ఎలాంటి సందేశం ఇస్తున్నారని హైందవ సంఘాల నేత రవీందర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. శ్రీశైల దేవస్థానం పండితులు, వైదిక కమిటీ అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also read
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!
- దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..





