SGSTV NEWS
Andhra PradeshCrime

AP Crime: తిరుపతిలో విషాదం.. విహారయాత్రలో విద్యార్థి మృతి.. అసలేమైందంటే?



AP Crime: తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థుల సాధారణ విహార యాత్ర విషాదాంతంగా మారింది. హాస్టల్ వార్డెన్‌కు తెలియకుండా 8 మంది విద్యార్థులు మామండూరు విహారయాత్రకు వెళ్లారు. వారంతా హుబ్లీ ప్యాసింజర్‌లో ప్రయాణించి మామండూరు రైల్వే స్టేషన్ వద్ద దిగారు. అక్కడే ప్రమాదం జరిగింది. వారిలో జాకేష్ అనే విద్యార్థి రైలు దిగిన తర్వాత స్టేషన్ ప్లాట్‌ఫారంను ఉపయోగించకుండా రైలు పైకి ఎక్కే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతను హై వోల్టేజ్ రైల్వే తీగలకు తగలడం వల్ల తీవ్రంగా గాయపడ్డాడు. 90 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్న అతడిని హుటాహుటిన తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రాణం తీసిన విహారయాత్ర:
వైద్యులు గమనించిన సమయంలో జాకేష్ పరిస్థితి విషమంగా ఉంది. విద్యుత్ ఘాతుకానికి గురైన తర్వాత అతని శరీరంపై తీవ్ర కాలిన గాయాలు ఏర్పడ్డాయి. ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. ఇతను డైరీ టెక్నాలజీలో చదువుకుంటున్న విద్యార్థిగా గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి విచారణ ప్రారంభించిన రైల్వే పోలీసులు.. విద్యార్థి ప్లాట్‌ఫారంను వదిలి ఎందుకు రైలు పైకి ఎక్కాడన్న అనుమానంతో తనిఖీ చేస్తున్నారు.

ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా, లేక ఏదైనా ఫోటో తీయడం కోసం ఈ పని చేశాడా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. విద్యార్థులు హాస్టల్ వార్డెన్‌కు సమాచారం ఇవ్వకుండా ఈ ప్రయాణానికి వెళ్లడం, రైల్వే స్టేషన్‌లో జాగ్రత్తలుంటే ఈ విషాదం తప్పించుకునే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. యూనివర్సిటీలో ఈ ఘటన విషాదాన్ని మిగిల్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు

Also read

Related posts

Share this