నరసాపురం : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మద్యం మత్తులో కుమార్తెపై కన్న తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ వార్డులో నివాసం ఉంటున్న నరేష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యను గల్ఫ్‌కు పంపించిన నరేష్ రోజువారి పనులకు వెళ్లేవాడు. మద్యం మత్తులో తొమ్మిదో తరగతి చదువుతున్న చిన్న కుమార్తె (13)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించడంతో బాధితురాలితో పాటు విషయం తెలిసిన ఆమె అక్క సైతం భయపడి ఎవరికీ చెప్పలేదు. ఇదే అలుసుగా తీసుకున్న నిందితుడు ప్రతిసారీ అత్యాచారానికి పాల్పడేవాడు. ఇటీవల బాధితురాలి తల్లి గల్ఫ్ నుంచి రావడంతో కుమార్తెలిద్దరూ తండ్రి నిర్వాహకాన్ని చెప్పి భోరుమన్నారు. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





