హైదరాబాద్: వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై జూబ్లీహిల్స్ పోలీసులు దాడి చేసి యువతితో పాటు విటుడిని అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. యూసుఫ్‌గూడ శ్రీకృష్ణానగర్ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు ఓ ఇంటిపై దాడులు చేశారు.
ఇంట్లో తనిఖీలు నిర్వహించగా అలేఖ్యరెడ్డి(26) అనే మహిళ ఆరు నెలలుగా వ్యభిచారం నడిపిస్తుందని పోలీసులు గుర్తించారు. ఆమె వెంకటేష్ అనే ఏజెంట్, రామ అనే వ్యక్తి పరిచయాల ద్వారా వ్యభిచారం నడిపస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అలేఖ్యరెడ్డి పోలీసులకు వివరించింది. ఆమెతో పాటు విటుడు వెంకట వినయ్‌కుమార్(27)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- కార్తీకపురాణం ప్రథమాధ్యాయ ప్రారంభః
- కార్తీక మాసం విశిష్టత
- Govardhan Puja Katha: ఇంద్రుడి అహంకారాన్ని అణచిన శ్రీకృష్ణుడు.. గోవర్ధన పూజ కథ తెలుసా?
- గోవర్ధన పూజ.. శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎందుకు ఎత్తాడు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





