ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, కొదుమూరు గ్రామంలో ఘోర సంఘటన వెలుగు చూసింది. పాల కోసం ఒక ఇంటికి వెళ్లిన ఇర్ఫాన్ అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేయబోయాడు. బాలిక కేకలు వేయడంతో యువకున్ని పట్టుకుని చితకబాదారు
ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, కొదుమూరు గ్రామంలో ఘోర సంఘటన వెలుగు చూసింది. పాల కోసం ఒక ఇంటికి వెళ్లిన ఇర్ఫాన్ అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేయబోయాడు.
ఇర్ఫాన్ పాలకోసం వెళ్లిన సమయంలో ఆ ఇంటిలో ఆరోతరగతి చదువుతున్న బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. ఇంట్లో ఎవరూ లేరని భావించిన ఇర్ఫాన్ ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టి అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే ఆ బాలిక కేకలు వేయడంతో ఇంటివెనుక తోటలో పని చేసుకుంటున్న తల్లిదండ్రలు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారి రాకను గమనించిన ఇర్ఫాన్ పారిపోయే ప్రయత్నం చేశాడు.
అయితే చుట్టుపక్కల వారు గమనించి ఆ యువకుడుని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.అత్యాచార యత్నానికి పాల్పడిన ఇర్ఫాన్ కొత్తగూడెంలోని అల్లిపురానికి చెందిన వాడిగా గుర్తించారు. పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- వసంత నవరాత్రులు స్టార్ట్! ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇలా చేస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది!
- Lord Shani: శత్రువెవరో మిత్రులెవరో తెలుస్తుంది..! శని దోషం కూడా వీరికి ఒక వరమే!
- Garuda Purana: కాకి పిండం తింటే పితృ దేవతలకు చేరినట్టేనా..? అసలు గరుడ పురాణం ఏం చెప్తుంది
- బాబోయ్.. వీళ్లది మామూలు పత్తేపారం కాదు..! దండెంపై ఆరేసిన జాకెట్ పొరుగింట్లో ప్రత్యక్షం.. ఏరులై పారిన రక్తం
- Vijayawada Accident: ఒక చేత్తో సెల్ఫోన్.. మరో చేత్తో డ్రైవింగ్.. అదుపుతప్పి కిందపడ్డ యువతి





