భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో భర్త ఆమెని దారుణంగా హత్య చేశాడు. తల నరికి భర్త పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. ఈ ఘటన బెంగళూరులోని అనేకల్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల శంకర్, 26ఏళ్ల మానస భార్యా భర్తలు. వారికి ఓ బిడ్డ కూడా ఉంది.
భార్యకు వివాహేతర సంబంధం ఉందని తల నరికి భర్త పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. ఈ ఘటన బెంగళూరులోని అనేకల్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల శంకర్, 26ఏళ్ల మానస భార్యా భర్తలు. వారికి ఓ బిడ్డ కూడా ఉంది. కొంతకాలం క్రితం వారు హీలలిగే గ్రామంలో ఇంటికి అద్దెకు తీసుకున్నారు. జూన్ 3 రాత్రి శంకర్ పనికి బయలుదేరాడు. మానసకు మరుసటి రోజు ఉదయం తిరిగి వస్తానని చెప్పాడు. అయితే, అతను ఆ రాత్రే పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో మానస మరొక వ్యక్తితో ఉందని భర్త చెప్పాడు. భార్యని శంకర్ నిలదీయగా గొడవ జరిగి మానస ఇంటి నుండి బయటకు వెళ్లిందని చెబుతారు.
ఆ తర్వాత నుంచి మానస చాలాసార్లు ఇంటికి తిరిగి వచ్చి శంకర్‌ను వేధించిందని ఆరోపించారు. హత్యకు ముందు రోజు(శుక్రవారం) రాత్రి, ఆమె మళ్ళీ ఇంటికి వచ్చి శంకర్‌తో గొడవకు దిగింది. దీంతో శంకర్ ఆగ్రహానికి లోనై మానస తల నరికి దారుణంగా హత్య చేశాడు. ఆమె తలను తీసుకొని సూర్యనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అధికారులకు లొంగిపోయాడు. సూర్యనగర్ స్టేషన్ నుండి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. శంకర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు
Also read
- గురు పూర్ణిమను వ్యాస పౌర్ణమి ఎందుకు అంటారు? ఈ పవిత్ర రోజున ఏం చేస్తే శుభఫలితాలు కలుగుతాయో తెలుసా..?
- చాక్లెట్ కొనిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిని..
- Andhra: నోటి దురుసు ఎంతపనిచేసింది.. భార్య వెళ్లిందని అలా మాట్లాడితేనే కొట్టి చంపేస్తారా..?
- హీటర్ ప్రాణం తీసింది..
- ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..





