హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో సాయికార్తీక్ అనే యువకుడి సిద్ధార్థరెడ్డి వద్ద రూ. 8 లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడు. మద్యం మత్తులో సిద్ధార్థరెడ్డి సాయికార్తీక్‌ను కొట్టి చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad Crime News: హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ ప్రాంతంల ఓ దారుణ ఘటన జరిగింది. డబ్బుల విషయంలో జరిగిన చిన్న గొడవే ఓ యువకుడి జీవితాన్ని బలితీసుకుంది. సాయికార్తీక్ అనే యువకుడిని అతని స్నేహితుడు సిద్ధార్థ రెడ్డి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. వీరిద్దరూ మిత్రులే అయినప్పటికీ.. వారి మధ్య డబ్బుల వ్యవహారమే చివరకు ప్రాణహానికి దారితీసింది.
ప్రాణం తీసిన డబ్బులు:
సాయికార్తీక్ గతంలో సిద్ధార్థ రెడ్డి నుంచి సుమారు 8 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తీసుకున్న తర్వాత ఆ డబ్బులు తిరిగి చెల్లించకుండా సాయికార్తీక్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. పైగా డబ్బు విషయమై నిత్యం వాదనలు జరుగుతున్నాయి. సాయికార్తీక్ సిద్ధార్థ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నాడని, బెదిరింపులకు కూడా పాల్పడుతున్నాడు. ఈ మధ్యలో మద్యం మత్తులో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రమవడంతో ఆవేశానికి గురైన సిద్ధార్థ రెడ్డి, సాయికార్తీక్‌ను తీవ్రంగా కొట్టాడు. దీంతో సాయికార్తీక్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ హత్య జరగటంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మృతుడు సాయికార్తీక్ స్వస్థలం వరంగల్ కాగా, నిందితుడు సిద్ధార్థ రెడ్డి కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. ఇద్దరూ నగరంలో ఉద్యోగాల నిమిత్తం కలిసి జీవిస్తూ వచ్చారు. వారి మధ్య ఉన్న స్నేహం, ఆర్థిక లావాదేవీలు ఇలా మృత్యువుకు దారి తీస్తాయి.ఈ ఘటన సాయికార్తీక్ ఇంట్లో తెలియగానే స్నేహితుడే ప్రాణం తీసినందుకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్ధార్థ రెడ్డి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also read
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న
- తొలిసారి భారత్‌లో మొదలైన బ్లాక్‌బాక్స్ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!
- విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVRను విశ్లేషించనున్న FSL బృందం
- ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలివేనా.? షాకింగ్ విషయాలు చెప్పిన అమెరికా నిపుణులు