ఏలూరు జిల్లా బాపురాజుగూడెంకి చెందిన మైనార్టీ బాలికను ప్రేమ పేరుతో ఆటో డ్రైవర్ మోసగించడంతో సదరు బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో స్పందించిన తండ్రి ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP Crime: ఏపీలో ప్రేమ వ్యవహారాలు రోజూ కోకటి బయటకు వస్తున్నాయి. శ్రీకాళహస్తిలో సోషల్ మీడియా ప్రేమ కథ మరవక ముందే మరో ప్రేమకథ బయటకు వచ్చింది. ప్రేమ విఫలం అయిందని ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన ఏలూరు జిల్లాలో కలకలం రేపింది.
పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో..
స్థానిక వివరాల ప్రకారం.. దెందులూరు నియోజకవర్గంలోని బాపురాజు గూడెం గ్రామానికి చెందిన మైనార్టీ బాలికను ప్రేమ పేరుతో ఆటో డ్రైవర్ మోసగించడంతో సదరు బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో స్పందించిన తండ్రి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వద్దకు చేరుకున్నారు. అనంతరం బాలిక కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలిక చెప్పిన వివరాల ప్రకారం.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఉన్న మైనర్ బాలిక, తండ్రి విలేకరులతో మాట్లాడుతూ.. బాలిక ఏడో తరగతి వరకు చదివి కుటుంబ పోషణ నిమిత్తం చదువు మానివేసి కూలి పనికి వెళుతుండగా గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గణేషు ఈ బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. అనంతరం అప్పుడప్పుడు కలుసుకుంటున్నామని.. దీంతో పెళ్లి చేసుకోమని ఈ బాలిక ఒత్తిడి తేవడంతో పెండ్లి చేసుకోనని డ్రైవర్ గణేష్ నిరాకరించడం వల్ల బాలిక మనస్థాపానికి గురై విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. దీనిపై పోలీసులు స్పందించి తమ బాలికకు న్యాయం చేయాలని తండ్రి వేడుకుంటున్నాడు.
Also read
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న
- తొలిసారి భారత్‌లో మొదలైన బ్లాక్‌బాక్స్ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!
- విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVRను విశ్లేషించనున్న FSL బృందం
- ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలివేనా.? షాకింగ్ విషయాలు చెప్పిన అమెరికా నిపుణులు