April 19, 2025
SGSTV NEWS
CrimeTechnology

మహాలక్ష్మి ట్రేడర్స్ లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్, సొత్తు స్వాదీనం

*వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు..*

ఏప్రిల్ 8వతేదీన అర్ధ రాత్రి సమయంలో *కేసముద్రం మెయిన్ రోడ్ లోని ఏ మార్ట్ పక్కన గల మహాలక్ష్మిట్రేడర్స్ కంపెనీలో* దొంగతనం జరగగా..,  అట్టి విషయంలో ఈరోజు ఉదయం బోడమంచ్యతండ సమీపంలో వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో  దొంగతనం చేసిన నేరస్తుడు *గుగులోతు నవీన్* s/o నాందేవ్(22) r/o రతిరాంతండ, నెల్లికుదురు మండలం అను వ్యక్తిని పట్టుకొని అతని నుండి  *ఐదులక్షల రూపాయలకు పైగా నగదు, కొత్త పల్సర్ బైక్,  రెండు బంగారం రింగులు, ఒక వెండి బ్రాస్లెట్, ఒక మొబైల్ ఫోను* స్వాధీనపరచుకొని అట్టి దొంగను ఈరోజు రిమాండ్ కు తరలించడం జరుగుతుందని *డిఎస్పీ తిరుపతిరావు* తెలిపారు.

ఈ…దొంగతనం కేసు విషయంలో ప్రతిభ కనబరిచిన *మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు, రూరల్ సిఐ సర్వయ్య, సిసిఎస్ సిఐ హాతిరం, సీసిఎస్ ఎస్ఐ తహేర్ బాబా, కేసముద్రం ఎస్ఐ మురళీధర్, కరుణాకర్, రాం చందర్,* మరియు కానిస్టేబుల్ లను *జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్*  అభినందించారు.

Also read

Related posts

Share via