April 15, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

AP Murder: ఏపీలో యువకుడి దారుణ హత్య.. అడ్డుకున్న స్నేహితుడి గుండెల్లో పొడిచి!


ఏపీలో మరో మర్డర్ జరిగింది. నర్సీపట్నం తలుపులమ్మ జాతరలో మహేష్, దుర్గా ప్రసాద్ మద్యం సేవించి గొడపడ్డారు. పోలీసులు వార్నింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. కానీ కోపం చల్లారని మహేష్.. ప్రసాద్ ఇంటికి వెళ్లి కత్తితో పొడిచి చంపాడు. మరో స్నేహితుడిపై దాడి చేశాడు.

AP Murder: ఏపీలో మరో దారుణ మర్డర్ జరిగింది. నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇటీవల మద్యం మత్తులో హత్యల పరంపర కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా 6 నెలల క్రితం మద్యం మత్తులో మున్సిపల్ పరిధిలోని కొత్త వీధిలో యువకుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారితీసింది. తాజాగా ఇదే తరహాలో మున్సిపాలిటీ పరిధిలోని అయ్యన్న కాలనీలో ఇద్దరు యువకుల ఘర్షణ జరిగింది.

ఇంటికి వెళ్లి కత్తితో పొడిచి..
ఈ మేరకు అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు వాళ్లకు సర్ది చెప్పి పంపించేశారు. కానీ జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు ముగిసిన తర్వాత రాత్రి 12 గంటల సమయంలో హతుడు రుత్తల దుర్గా ప్రసాద్ ఇంటికి వెళ్లి చిత్రాడ మహేష్ మరోసారి ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో మహేష్ అనే యువకుడు ప్రసాద్ అనే యువకుడిని కత్తితో గుండుల మీద పొడిచి హత్య చేశాడు. అడ్డుకోబోయిన సాయి అనే యువకుడ్ని కూడా పొట్ట భాగంలో కత్తితో పొడిచాడు.

ఘటన గురించి తెలియగానే అక్కడకు వెళ్లిన సిఐ జి.గోవిందరావు వివరాలు వెల్లడించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ అయ్యన్న కాలనీలో మంగళవారం రాత్రి తలుపులమ్మ తల్లి పండగ జరిగింది. జాతర జరుగుతున్న సమయంలో చిత్రాడ మహేష్, రుత్తల దుర్గా ప్రసాద్ మద్యం సేవించి ఘర్షణ పడ్డారు. ప్రసాద్ ను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఇదే సమయంలో అడ్డుగా వచ్చిన మరో యువకుడికి కూడా గాయాల య్యాయని సీఐ తెలిపారు. నిందితుడు మహేష్ పరార్ అయ్యాడని, గాలిస్తున్నామని తెలిపారు.


Also read

Related posts

Share via