శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక కనిపించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది,. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక భక్తుడు లడ్డూలో బొద్దింకను గుర్తించి, ఆలయ సిబ్బందిని ప్రశ్నించగా, సిబ్బంది ఆ లడ్డూను లాక్కున్నారని, వీడియో తీసిన వారిపై ఒత్తిడి చేసి విషయం బయటకు రాకుండా చేసే ప్రయత్నం చేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భక్తులు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. పవిత్రమైన ప్రసాదంలో ఇటువంటి లోపం జరగడం దారుణమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం దేవాలయాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటూ ఉంటారు. శ్రీశైలం భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. పండుగలు, పర్వదినాలు, సెలవు రోజుల్లో శ్రీశైలానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆదివారం కూడా శ్రీశైలం దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అయితే ఆదివారం శ్రీశైలంలో జరిగిందంటున్న ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక కనిపించిందంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. శ్రీశైలం లడ్డూలో బొద్దింక కనిపించగా.. భక్తుడు వెంటనే ఆలయ సిబ్బందిని ఈ విషయం గురించి ప్రశ్నించాడు. దీంతో అతని నుంచి లడ్డూను ఆలయ సిబ్బంది లాక్కున్నారని చెప్తున్నారు.
మరోవైపు శ్రీశైలం లడ్డూలో బొద్దింక కనిపించడంపై భక్తులు మండిపడుతున్నారు. పవిత్రమైన లడ్డూలో ఇదేంటని.. కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై శ్రీశైలం దేవస్థానం ఈవో స్పందించారు. ఈ ఘటన నిజంగానే జరిగిందా లేదా ఎవరైనా కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారనే దానిని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు శ్రీశైలం ఈవో వెల్లడించారు.
మరోవైపు నల్లమల్ల అడవుల్లో కొలువైన శ్రీశైలం.. ప్రముఖ శైవక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా, 18 అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా పురాణాలు చెప్తున్నాయి. శ్రీశైలం దేవాలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు. ఈ ఆలయంలో నాలుగు గోపురాలు, శిల్పకళాఖండాలతో అలంకరించబడిన ముఖమండపం, నందికేశ్వర విగ్రహం ఉన్నాయి. శ్రీశైలంలో స్వామివారి దర్శనం, రుద్రాభిషేకం, ఇతర సేవలకు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సౌకర్యం ఉంది. శ్రీశైలం గర్భగుడిలో ప్రవేశించాలంటే సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి. మహాశివరాత్రి సమయంలో 11 రోజుల పాటు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాగే శ్రావణ మాసం, దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. శ్రీశైలం వచ్చే భక్తుల కోసం దేవస్థానం కాటేజీలు, ధర్మశాలలు అందుబాటులో ఉన్నాయి.
మరోవైపు ఇటీవల శ్రీశైలంలో బులెట్లు, బాంబులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆలయానికి సమీపంలోనే ఇవి బయటపడటం సంచలనం రేపింది. అయితే ఓ పోలీస్ సిబ్బంది వీటిని అక్కడ మరిచిపోయినట్లు తర్వాత విచారణలో వెల్లడైంది. అయితే ఈ ఘటన మాత్రం స్థానికంగా కలకలం రేపింది.
Also read
- గ్లిజరిన్ వేసుకుని ఏడ్చినట్లు నమ్మించిందా?.. తేజేశ్వర్ హత్య కేసులో కొత్త అంశం
- Tadipatri: వేట కొడవలితో దాడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
- Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం.. కుమారుడిని చంపి కాలువలో పూడ్చేసిన తండ్రి
- Crime News: ప్రియుడితో కలిసి భర్తను చంపించి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
- నేటి జాతకములు..16 జూలై, 2025