SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra News: చెదిరిన కలలు.. ప్రయాణికులను కన్నీరు పెట్టించిన సంఘటన.. అసలు ఏం జరిగిందంటే?



కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు కిందపడి ఒక బీటెక్‌ విద్యార్థి తన రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. ట్రైన్‌ తన కాళ్లపై నుంచి వెళ్లడంతో అతని రెండు కాళ్లు తెగిపోయాయి. ఆ నొప్పి తట్టుకోలేక ఆ విద్యార్థి పెట్టిన ఆర్థనాదాలు అక్కడు ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తెప్పించాయి.


కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ కింద పడి ఓ విద్యార్ధి రెండు కాళ్ళు పోగొట్టుకున్నాడు. మోకాళ్ళు వరకు కాళ్ళు మొత్తం తెగిపోయి ఒకటో నెంబర్ ప్లాట్ఫారంపై ఆ విద్యార్ధి పడిన వేదన స్థానిక ప్రయాణికులను కలిచివేసింది. అతన్ని ఆ పరిస్థితిలో చూసిన వారందరికి కళ్ళు చెమర్చాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని.. ఆ విద్యార్థిని హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతను హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.


వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం వెంకటనగరానికి చెందిన హేమంతరాజ్ అనే యువకుడు బీటెక్ చదువుతున్నాడు. ఇతను ప్రతిరోజు తమ ఊరి నుంచి తుని రైల్వే స్టేషన్‌కు వచ్చి.. అక్కడ నుండి సామలకోట వరకు రైల్లో చేరుకొని.. ఆ తర్వాత ఆటోలో సూరంపాలెంలో ఉన్న ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజ్‌కు వెళతాడు. రోజు మాదిరిగా శుక్రవారం కూడా హేమంత్‌ తుని రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. అప్పుడే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రావడంతో ట్రైన్‌ ఎక్కేందుకు సిద్దమయ్యాడు. ఈ క్రమంలో కాలు జారి కిందపడిపోయాడు. దీంతో ట్రైన్‌ అతని కాళ్లపనై నంచి వెళ్లిపోయింది.

పడిపోయిన వెంటనే ఏం జరిగిందో హేమంత్‌కు అర్థం కాలేదు. కాసేపటి తేరుకొని తనకేమైందో చూసేకొనే సరికి తన రెండు కాళ్ళు నుజ్జునుజు అయ్యాయి. ట్రైన్‌ తన కాళ్లపై నుంచి పోవడంతో ఆ నొప్పిని భరించలేక హేమంత్‌ అరగంట పాటు నరకయాతన అనుభవించాడు. భవిష్యత్ గురించి తాను కన్న కలలు ఒక్క సారిగా ఆవిరి అయిపోయాయి అని బోరున విలపించాడు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని హేమంత్‌ను వైజాగ్ కేజీహెచ్కు తరిలించారు

Also read

Related posts