ఆర్థిక ఇబ్బుందులు ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఆ బాధలు భరించలేక ఓ తండ్రి ఘోరానికి పాల్పడ్డాడు. కన్న కూతురును చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Crime News: ఆర్థిక ఇబ్బుందులు ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఆ బాధలు భరించలేక ఓ తండ్రి ఘోరానికి పాల్పడ్డాడు. కన్న కూతురును చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బహదూర్‌పల్లి ప్రాంతంలో నివాసం ఉండే అశోక్ (50) తన భార్య సోని, కూతురు దివ్య (5)లతో కలిసి ఇందిరమ్మ కాలనీలో అద్దెకుంటున్నారు. ఆయన వంట మనిషిగా పనిస్తున్నాడు. మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో లారీ ఢీకొట్టడంతో భార్య సోనీ ఎడమ కాలుకు తీవ్ర గాయమైంది. దీంతో ఆ కాలు తీసేశారు. అప్పటి నుంచి సోని ఇంట్లోనే ఉంటుంది. ఆమె ఏ పని చేయలేని పరిస్థితి నెలకొంది.
మరోవైపు అశోక్‌కూ ఎప్పుడో ఒకసారి తప్ప పెద్దగా పనులు దొరకడం లేదు. పనిలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. దీంతో ఆ కుటుంబానికి జీవితంపై విరక్తి కలిగింది. 3 రోజుల క్రితం రాత్రి ఇంట్లో గ్యాస్ లీక్ చేసి.. కుటుంబ సభ్యులంతా చనిపోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లే గ్యాస్ లీక్ చేశారు. అయితే కొంత సేపటికే భార్య సోని గ్యాస్ వాసన భరించలేఉ బయటికొచ్చి కేకలేసింది. దీంతో చుట్టు పక్కల వారి సాయంతో గ్యాస్ సిలిండర్‌ను ఆఫ్ చేశారు. అయినా అశోక్ తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. మరునాడు కూతురు దివ్యను తీసుకుని బయటకు వెళ్లి తిరిగిరాలేదు. అయితే బయటకెళ్లిన అశోక్.. మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ కళాశాల వెనుక ఉన్న చెరువులో దూకారు. మరునాడు వారి శవాలు తేలాయి. మృతులు ఇందిరమ్మ కాలనీ వాసులని స్థానికులు చెప్పడంతో అశోక్ భార్య సోనికి సమాచారం అందించారు. ఆమె ఘటనా స్థలానికి వచ్చి బోరున విలపించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.. మృతదేహాలను చెరువు నుంచి వెలికితీసి పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా తండ్రీ కూతుళ్ల మృతితో ఆ ప్రాంతంలో విషాద నెలకొంది.
Also read
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!





