ప్రభుత్వాసుపత్రిలో మృతదేహం కన్ను మాయమైన ఘటన పట్నాలో జరిగింది. ఇటీవల దండగుల కాల్పుల్లో ఫంతుష్ కుమార్ మరణించాడు. అనంతరం మార్చురీలో ఉన్న అతడి మృతదేహాన్ని పోస్టుమార్టంకి తీసుకొస్తుండగా ఎడమ కన్నులేదు. ఎలుకలు పెకిలించి ఉంటాయని వైద్యులు తెలిపారు.
ఇదొ విచిత్రమైన ఘటన. ప్రభుత్వ హాస్పిటల్లో మృతదేహం కన్ను మిస్సింగ్ అయింది. ఆ కన్నును ఎలుకలు తినేసి ఉంటాయని హాస్పిటల్ డాక్టర్లు ఓవైపు చెప్తున్నారు. మరోవైపు సిబ్బందే ఆ కన్నును తొలగించినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఆ కన్ను ఎవరిది? అనే విషయానికొస్తే..
ఫంతుష్ కుమార్ మృతి
ఈ నెల 15 (నవంబర్)న దండగుల కాల్పుల్లో ఫంతుష్ కుమార్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వెంటనే ఫంతుష్ కుటుంబ సభ్యులు అతడ్ని నలంద ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేయించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఫంతుష్ అదే రోజు రాత్రి మరణించాడు.
కన్ను మాయం
అనంతరం ఫంతుష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. ఆపై ఆ మరుసటి రోజు ఉదయం పోస్టుమార్టం కోసం తీసుకురాగా.. కన్ను మాయమైనట్లు మృతుడి కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో హాస్పిటల్ యాజమన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చురీ నుంచి మృతదేహాన్ని తీసుకొస్తున్నపుడు ఎడమ కన్ను లేకపోవడాన్ని గుర్తించామన్నారు. అంతేకాకుండా పక్కనే సర్జికల్ బ్లేడ్ కూడా ఉన్నట్లు వారు తెలిపారు.
వైద్యుల వెర్షన్
మరోవైపు వైద్యులు మాత్రం మృతదేహం కన్నును ఎలుకలు పెకిలించి ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. దీంతో ప్రాథమిక సమాచారం మేరకు ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు నర్సులను సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారిని సస్పెండ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
Also read
- నేటి జాతకములు 26 సెప్టెంబర్, 2026
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!





