బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు బీచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో ఈతకు వెళ్ళి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. బీచ్‌లో ఐదుగురు గల్లంతవ్వగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మృతులు విజయవాడ, ఇబ్రహీం పట్నం, సూర్యారావు పేటకు చెందిన వారుగా గుర్తింపు.
బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు బీచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో ఈతకు వెళ్ళి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. బీచ్‌లో ఐదుగురు గల్లంతవ్వగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వాడరేవు బీచ్‌కు చేరుకున్న బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
మృతులు విజయవాడ, ఇబ్రహీం పట్నం, సూర్యారావు పేటకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్ధులు సాయి మణి దీప్ , జీవన్ సాద్విక్, శ్రీ సాకేత్లుగా గుర్తించారు. గల్లంతైన మరో ఇద్దరు బాపట్లజిల్లా వేటపాలెం మండలం వడ్డే సంఘానికి చెందిన గౌతమ్ (15), షరాన్ (18) ల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో సరదాగా గడిపేందుకు వచ్చిన యువకులు రాకాసి అలల తాకిడికి రెండు వేరు వేరు ప్రమాదాలలో ఐదుగురు యువకులు సముద్రంలో గల్లంతయ్యారు. విజయవాడ, ఇబ్రహీం పట్నం కు చెందిన విట్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకుంటున్న మొత్తం ఏడుగురు స్నేహితులు ఆదివారం (అక్టోబర్ 12) కావడంతో సరదాగా గడిపేందుకు వాడరేవుకు వచ్చారు. వీరిలో ఎంటెక్ చదువుతున్న సాయి మణి దీప్ (19), జీవన్ సాద్విక్, శ్రీసాకేత్ సముద్రంలో గల్లంతయ్యారు. కొద్దిసేపటికి విద్యార్ధుల మృతదేహాలు సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఇదే ప్రాంతంలో మరో ప్రమాదంలో వేటపాలెం మండలం వడ్డే సంఘానికి చెందిన గౌతమ్ (15) షరాన్ (18) లు గల్లంతయ్యారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు
Also read
- Hyderabad: నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం.. కట్‌చేస్తే..
- ఓ వ్యక్తిని బండరాళ్లతో కొట్టుకుంటూ.. వీడియోలు షూట్ చేసిన మానవ మృగాలు..!
- Telangana: పరీక్షలో ఫెయిలయ్యానని విద్యార్థిని సంచలన నిర్ణయం.. ఏం చేసిందంటే?
- Sri Veereswara Swamy Temple : మీకు పెళ్లి కావట్లేదా..? వెంటనే కోనసీమలో ఉన్న ఈ ఆలయంలో కళ్యాణం చేయించండి..
- జేబులో బోలెడంత డబ్బు.. ఈ మూడు రాశుల వారి ఇంట ధన వర్షమే!





