ఆ పిల్లలు దేవుడి దర్శనానికి వెళ్లి.. సరదాగా సముద్రంలోకి దిగారు.. ఇలా ఒక్క అడుగు వేశారో లేదో.. వాంతులు, భరించలేని కడుపునొప్పితో బాధపడ్డారు. వారి తల్లిదండ్రులు ఠక్కున ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
నీళ్లు చూస్తే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికి సరదాగా ఉంటుంది. ఇక నదిలో స్నానం చేయటం, సముద్ర స్నానాలకు విశేష ప్రాధాన్యత ఇస్తారు. ఆలయాలకు వెళితే అక్కడి నదిలో మూడు మునకలు తప్పకుండా వేస్తారు భక్తులు. ఇక సంద్రం దగ్గర పిల్లలు చేసే హడావుడికి అంతే ఉండదు. ఎగిసిపడే అలలు.. కాలి కింద ఇసుకను లాగేస్తుంటే.. ఆ అనుభవాన్ని ప్రత్యక్షం అనుభవిస్తే కానీ.. అందరికి మజా తెలుస్తుంది.
ఇలాగే కొందరు సముద్రంలో దిగిన పిల్లలు, తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం అంతర్వేది నరసింహస్వామి దర్శనానికి వెళ్లిన భక్తులు సమీపంలోని సముద్రం వద్దకు స్నానానికి దిగారు. పిల్లలు ఒక్క అడుగు లోపలికి వేసారో లేదో వెంటనే భయంతో ఒడ్డు వైపు పరుగులు తీశారు. ఏదో కరంట్ షాక్ కొట్టిన ఫీలింగ్. ఆ వెంటనే వాంతులు, భరించలేని కడుపునొప్పి. పిల్లల బాధ చూసిన తల్లిదండ్రులు పరుగు పరుగున వారిని తీసుకుని ఆసుపత్రులకు పరుగులు తీశారు.
పాలకొల్లుకు చెందిన ఒక పాప ఇలాగే అస్వస్థతకు గురైంది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో సముద్ర స్నానానికి దిగిన చిన్నారి సాయిశ్రీకి సముద్ర జీవి కుట్టడంతో ఒంటిపై దద్దుర్లు రావడంతో పాటు శరీరం వేడి మంటలకు గురికావడంతో ఆ చిన్నారి తీవ్ర ఇబ్బందికి గురైంది. అయితే సముద్రంలో జెల్లీ ఫిష్ జాతికి చెందిన జీవి జిగురు వంటి పదార్థం తగలడంతో చిన్నారులకు ఈ విధంగా ఎలర్జీ వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇక ముందు సముద్రంలో దిగాలంటే ఒక్కసారి నీరు ఎలా ఉందో చూసుకోవాల్సిందే.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





