హిందూ మతంలో తులసి మొక్కకి విశేషమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. తులసి మొక్కను స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. దాదాపు ప్రతి హిందువు ఇంట్లో తులసిమొక్క ఉండడం సహజం. మీ ఇంట్లో తులసి మొక్క ఉండి.. అకస్మాత్తుగా దానిలో కొన్ని రకాల మార్పులు కనిపించడం ప్రారంభిస్తే.. మీ ఇంటికి డబ్బు రాబోతోందని అర్థం. జ్యోతిషశాస్త్రంలో.. తులసిలో కనిపించే ఈ లక్షణాలను ధనవంతులయ్యే సంకేతాలుగా భావిస్తారు.
హిందూ మతంలో తులసిని లక్ష్మీదేవి రూపంగా పూజిస్తారు. తులసిని పూజించే ఇంట్లో ఎప్పుడూ సంపదకు కొరత ఉండదని, లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఒక మత విశ్వాసం ఉంది. తులసి మొక్క పచ్చగా ఉంటే.. ఆ ఇంట్లో శ్రేయస్సు ఉంటుందని నమ్ముతారు. మరోవైపు తులసి మొక్క ఎండిపోతే ఆ ఇంట్లో కొంత ఇబ్బంది రాబోతోందని అర్థం అని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది.
తులసి మొక్క ఇలా కనిపిస్తే ఇంట్లోకి ధనం రానున్నందని అర్ధం అట
ధనవంతులు అయ్యే సంకేతాలు హిందువుల ఇంట్లో దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. రోజూ తులసి మొక్కకి పూజలను చేస్తారు. తులసి మొక్కని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పుజిస్తారు. పూజలో లేదా శుభకార్యంలో ఇది అవసరం. అయితే మీ ఇంట్లో ఉన్న తులసి మొక్కలో అకస్మాత్తుగా కొన్ని మార్పులు రావడం ప్రారంభిస్తే.. మీరు ధనవంతులు అయ్యే సంకేతం కనిపిస్తున్నారని అర్థం చేసుకోండి.
పుష్పించే తులసి మొక్క వాస్తు శాస్త్రం ప్రకారం ధనవంతులు కావడానికి ముందు ఇంట్లో నాపెంచుకునే తులసి మొక్క కొన్ని శుభ సంకేతాలను ఇస్తుంది. తులసి మొక్క అకస్మాత్తుగా పచ్చగా మారినా.. తులసి మొక్క పువ్వులు పెరగడం ప్రారంభించినా లేదా తులసి మొక్క మొగ్గలు ఎక్కువగా కనిపించడం ప్రారంభించినా.. త్వరలో మీ వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఆదాయం పెరుగుతుందని.. అకస్మాత్తుగా ఎక్కడి నుంచి అయినా డబ్బు వచ్చే అవకాశం ఉందని అర్ధం. అంతేకాదు మీరు అప్పుల నుంచి కూడా విముక్తి పొందనున్నారని తులసి మొక్కలో కనిపించే ఈ సంకేతాలకు అర్థం.
తులసిలో దర్భలు పెరగడం ఇంట్లో తులసి మొక్క దగ్గర లేదా తులసి కుండీలో దర్భ గడ్డి పెరగడం ప్రారంభిస్తే.. ఇది కూడా ధనవంతులు కావడానికి సంకేతంగా పరిగణించబడుతుంది. దర్భ గణేశుడికి చాలా ప్రియమైనది. తులసి లక్ష్మీ దేవికి ప్రియమైనది. దీపావళి రోజున లక్ష్మీదేవిని, గణేశుడిని పూజించే సంప్రదాయం ఉంది. అటువంటి పరిస్థితిలో తులసి మొక్కలో దర్భలు పెరుగుతుండడం అంటే మీరు రాబోయే కాలంలో ధనవంతులు కాబోతున్నారని సూచిస్తుందట.
Also read
- గ్లిజరిన్ వేసుకుని ఏడ్చినట్లు నమ్మించిందా?.. తేజేశ్వర్ హత్య కేసులో కొత్త అంశం
- Tadipatri: వేట కొడవలితో దాడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
- Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం.. కుమారుడిని చంపి కాలువలో పూడ్చేసిన తండ్రి
- Crime News: ప్రియుడితో కలిసి భర్తను చంపించి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
- నేటి జాతకములు..16 జూలై, 2025