SGSTV NEWS
Hindu Temple HistorySpiritual

కాశీలోని కాల భైరవస్వామి ఆలయం ప్రాముఖ్యత ఏమిటి? దర్శనం వలన ఏమి జరుగుతుందంటే..




Kala Bhairava Temple: కాశీలోని కాల భైరవస్వామి ఆలయం ప్రాముఖ్యత ఏమిటి? దర్శనం వలన ఏమి జరుగుతుందంటే..
ప్రపంచంలోనే అతి పురాతన క్షేత్రం వారణాశి. సాక్షాత్తు పరమేశ్వరుడు విశ్వనాథుడుగా.. పార్వతీదేవి అన్నపూర్ణగా కొలువైన ఈ క్షేత్రాన్ని తన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. పరమ పవిత్రమైన ఈ క్షేత్రానికి పాలకుడు కూడా శివుని అంశమైన ఉగ్ర రూపం కాలభైరవుడు కావడం విశేషం. ఈ ఆలయం కాశీలోని పురాతన ఆలయంగా పరిగణింపబడుతోంది. ఇక్కడ ఉన్న కాలభైరవుడిని మొదట దర్శించుకుని తర్వాత విశ్వనాథున్ని దర్శించుకోవాలని ఓ నమ్మకం. ఈ రోజు కాశీలోని కాల భైరవుడిని సందర్శించడం ద్వారా ఏమి జరుగుతుంది? ఈ ఆలయం ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.


కాశీలోని కాల భైరవ ఆలయం వారణాసిలోని పురాతన ఆలయాలలో ఒకటి. ఇక్కడ కాల భైరవ బాబాను కాశీ క్షేత్ర పాలకుడు అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం కాశీ క్షేత్రపాలుడు అని పిలువబడే శివుని ఉగ్ర రూపమైన కాల భైరవుడికి అంకితం చేయబడింది. మత విశ్వాసం ప్రకారం కాశీ ప్రజలను శిక్షించే హక్కు కూడా బాబా కాల భైరవుడికి ఉంది. బాబా దర్శనం కోసం ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు. కాశీలోని కొత్వాల్ బాబా కాల భైరవుడి ఆలయం ప్రాముఖ్యత ఏమిటంటే..

హిందూ మత విశ్వాసాల ప్రకారం కాశీలోని కాల భైరవ ఆలయాన్ని సందర్శించి పూజించడం ద్వారా అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాల భైరవ ఆలయం దెయ్యం-ఆత్మ అడ్డంకులు, తాంత్రిక ఆచారాల నుంచి ఉపశమనం పొందటానికి చాలా ప్రసిద్ధి చెందింది. కాల భైరవుడిని సందర్శించడం ద్వారా భయం, ప్రతికూల శక్తి , సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని చెబుతారు.

కాల భైరవుడిని దర్శనం వల్ల ఏమి జరుగుతుంది?
కాశీలో కాల భైరవుడిని నగర రక్షకుడు అని కూడా పిలుస్తారు. కొన్ని నమ్మకాల ప్రకారం కాశీలో కాల భైరవుడిని సందర్శించడం ద్వారా అనేక జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఉజ్జయినిలోని మహాకాళుడిని సందర్శించే ముందు కాల భైరవ బాబాను సందర్శించడం అవసరమని.. తద్వారా పూజ పూర్తి అవుతుందని చెబుతారు.

1  సమస్యల నుంచి విముక్తి: కాశీలో కాలభైరవుడిని పూజించడం వల్ల జీవితంలోని కష్టాలు, శత్రువులు, ప్రతికూల శక్తుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

2  శారీరక , మానసిక రక్షణ: కాలభైరవుడిని పూజించడం ద్వారా, భక్తులు శారీరక , మానసిక బలాన్ని పొందుతారు. భయం నుంచి విముక్తి పొందవచ్చు.

3  కోరికలు నెరవేరుతాయి: కాలభైరవుడిని పూజించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో ఆనందం కలుగుతుంది.

4  సంతానం పొందడం: కొన్ని నమ్మకాల ప్రకారం కాశీలోని కాలభైరవ ఆలయాన్ని సందర్శించడం ద్వారా సంతానం పొందుతారు. దంపతులకు సంతానం కలిగి ఆనందం లభిస్తుంది.

5   శత్రువులపై విజయం: కాలభైరవుడిని పూజించడం ద్వారా శత్రువులు నాశనమై భక్తులు కోరుకున్న విజయం పొందుతారు.

6  సంపద, అదృష్టం ప్రాప్తి: కాశీలో కాలభైరవుడిని పూజించడం వలన సంపద, అదృష్టం, శ్రేయస్సు కలుగుతాయి.

7  చట్టపరమైన విషయాలలో విజయం: కాలభైరవుడిని పూజించడం వల్ల చట్టపరమైన విషయాలలో కూడా విజయం లభిస్తుందని నమ్ముతారు

Related posts

Share this