పార్వతీపురం మన్యం జిల్లాలో నవ వధువు అనుమానాస్పద మృతి కలకలం రేపుతుంది. భర్తతో కలిసి పుట్టింటికి ఆనందంగా వచ్చిన ఆ యువతి మరుసటి రోజు ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేదా ఎవరైనా హత్య చేశారా? అనే అనుమానాలు తలెత్తాయి. ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మోసురులో నవ వధువు వేలాంగిణి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఈ నెల 28న ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు వేసుకొని ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పాచిపెంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి రాము. అయితే రాము ఫిర్యాదుతో పోలీసులు ఆత్మహత్యగా కాకుండా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మోసూరుకు చెందిన ఆమిటి రాము దంపతులకు మనోజ్ అనే కొడుకు వేళాంగిణి అనే కుమార్తె ఉన్నారు. కుమారుడు డిగ్రీ చదువుతుండగా కుమార్తె వేళాంగిణికి ఇంటర్ పూర్తవ్వగానే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన నిమ్మాది బుజ్జి అనే వ్యక్తితో ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేశారు తల్లిదండ్రులు. పెళ్లి అయిన తర్వాత భర్తతో పాటు భీమవరంలోనే ఉంటోంది వేళాంగిణి. అయితే ఏమైందో ఏమో కానీ భర్త బుజ్జి మే 27న వేళాంగిణిని తీసుకొచ్చి పుట్టింట్లో వదిలి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు వేళాంగిణి ఇంట్లో ఉరేసుకొని శవమై కనిపించింది. వేలాంగిణి మృతిపై దర్యాపు చేస్తున్నారు పోలీసులు. ఆకస్మాత్తుగా తన భర్త ఆమెను పుట్టింట్లో ఎందుకు దించి వెళ్లాడు? ఇద్దరికి ఏమైనా ఘర్షణ జరిగిందా? లేకా ఇంకా ఏమైనా కారణాలున్నాయా? అనే దిశగా విచారణ సాగుతోంది.
అయితే పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంటర్ వరకు చదివిన వేళాంగిణి గతంలో కొన్ని రోజులు ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. అప్పట్లో వేళాంగిణిపై మిస్సింగ్ కేసు కూడా పాచిపెంట పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. తరువాత కొన్ని రోజులకు తనంతట తానే తిరిగి వచ్చేసింది. ఆ తరువాత ఇంటర్ పూర్తి కాగానే వివాహం చేశారు. అయితే వేళాంగిణి తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంటుంది. రక్తం తక్కువగా ఉండటంతో పలు రకాల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అందుకు ఆమె చికిత్స కూడా తీసుకుంటోంది. ఈ క్రమంలోనే గత రెండు నెలలుగా దాంపత్య జీవనంలో కూడా వేళాంగిణి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో భర్తతో ఏమైనా విభేదాలు వచ్చాయా? అందుకే భర్త సడన్‌గా వేళాంగిణిని తల్లిదండ్రుల వద్ద వదిలి వెళ్ళిపోయాడా? మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిందా? అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు పోలీసులు.
మరోవైపు వేళాంగిణి ఉరేసుకొని ఉన్న చోట గాజులు పగిలిపోయి ఆ ప్రాంతమంతా చిందరవందరగా ఉండటంతో ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వేలాంగిణి మృతిపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన కుమార్తె ఎందుకు చనిపోయిందో? తెలియదని చెప్తున్నారు. మరోవైపు భర్త బుజ్జి కూడా తన భార్య చాలా మంచిదని, ఎలా చనిపోయిందో తెలియదని అంటున్నాడు. ఇటు తల్లిదండ్రులు, అటు భర్త కూడా వేళాంగిణి ఎందుకు చనిపోయిందో తెలియదని అనడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే పోలీసులు వేళాంగిణి మృతిపై లోతైన విచారణ చేపట్టిన నేపథ్యంలో మృ పై వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశం జిల్లాలో కలకలం రేపుతుంది.
Also read
- Andhra News: నిత్యం తాగొచ్చిన తల్లిని వేధిస్తున్న తండ్రి.. తల్లి బాధ చూడలేక కొడుకు ఏం చేశాడంటే?
- Warangal: అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. వాటిని కాజేసేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Chittoor: తాగునీటిని పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులు.. అక్కడ కనిపించిన సీన్ చూడగానే..
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న
Kiran Royal Issue: జనసేన నేత కిరణ్ రాయల్ కేసులో బిగ్ ట్విస్ట్.. లక్ష్మి అరెస్ట్