* వివాహితపై మాజీ ప్రజాప్రతినిధి లైంగిక వేధింపులు
* మరిపెడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
మరిపెడ రూరల్: కోరిక తీరుస్తేనే నా మామిడి తోటలో నుంచి దారి ఇస్తా.. లేదంటే ఇటునుంచి రావొద్దని ఓ గ్రామ మాజీ ప్రజాప్రతినిధి వివాహిత ను లైంగికంగా వేధించాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎడ్జెర్ల గ్రామ పరిధిలోని గుర్రప్పతండాలో ఆలస్యంగా సోమవారం వెలుగు చూసింది.
వివరాల ప్రకారం.. గుర్రప్పతండా గ్రామ పంచాయతీకి చెందిన వివాహిత భర్త కుటుంబానికి తండా శివారులో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అదే గ్రామ పంచాయతీకి చెందిన వరుసకు బాబాయ్ అయ్యే గ్రామ మాజీ ప్రజాప్రతినిధికి చెందిన మామిడితోటలో నుంచి వారి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాల్సి ఉంది. కాగా, సుమారు 50 మంది రైతు కుటుంబాలు మామిడి తోటలోని దారి నుంచి తమ వ్యవసాయ క్షేత్రాలకు రాకపోకలు కొనసాగిస్తారు.
ఈ క్రమంలో ఈ నెల 26న సదరు వివాహిత కూడా తన వ్యవసాయ భూమి వద్దకు ఒంటరిగా వెళ్తుండగా.. మాజీ ప్రజా ప్రతినిధి ఎదురుగా వచ్చి ఆమెను ఆపాడు. తన కోరిక తీరుస్తేనే మామిడితోటలో నుంచి నడవాలని లైంగికంగా వేధించాడు. ఈ క్రమంలో బాధిత వివాహిత మరుసటిరోజు తన భర్తకు జరిగిన విషయం చెప్పింది. ఈమేరకు ఆమె తన భర్తతో కలిసి పోలీసే స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఈ విషయంపై మరిపెడ పోలీసులను వివరణ కోరగా బాధిత వివాహిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Also read
- హెల్మెట్ ఉన్నా దక్కని ప్రాణం.. ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం!
- మైలవరంలో విషాదం.. నదిలో మునిగి అత్త, అల్లుడు మృతి
- ఇద్దరు మహిళలతో భర్త.. చూసి పూనకంతో ఊగిపోయిన భార్య.. ఆ తర్వాత..!
- బస్సులో తెరచుకున్న అత్యవసర ద్వారం.. కిందపడి బాలికకు తీవ్రగాయాలు
- భార్య, అత్తామామల దాడి.. ఆర్మీ ఉద్యోగి మృతి





