SGSTV NEWS
CrimeTelangana

TG Crime: తెలంగాణలో దారుణం.. క్షుద్రపూజల పేరుతో చిన్నారితో నీచంగా..!


తెలంగాణలోని ఆదిలాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యం బారిన పడ్డ బాలికకు క్షుద్ర పూజలు చేసిన మాంత్రికుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక కేకలు వేయడంతో కుటుంబ సభ్యలు అతడిని పోలీసులకు అప్పగించారు.

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న బాలికకు క్షుద్రపూజలు చేస్తే అంతా నయం అవుతుందని నమ్మించారు. ఆపై ఒక మంత్రగాడిని రప్పించారు. బాలికతో పూజలు చేయించాలని.. రూమ్‌లో ఎవరూ ఉండకూడదని మంత్రగాడు చెప్పాడు. దీంతో అందరూ బయటకు వెళ్లిపోయిన తర్వాత ఆ బాలికతో మంత్రగాడు అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ఆ బాలిక కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు లోపలకి వచ్చి ఘటనను ఆపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.

బాలికతో అసభ్య ప్రవర్తన
ఆదిలాబాద్‌లో నివాసముంటున్న దంపతుల కుమార్తె అనారోగ్యం బారిన పడింది. ఆమెకు దోషం ఉందని.. క్షుద్రపూజలు చేస్తే అంతా నయం అవుతుందని కుటుంబ సభ్యులకు మధ్యవర్తి తెలిపాడు. తనకు తెలిసిన మాంత్రికుడు ఒకరు ఉన్నారని.. అతడు వచ్చి పూజలు చేస్తే ఆరోగ్యం కుదుటపడుతుందని తెలిపాడు. దీంతో ఆ మధ్యవర్తి మాటలు విన్న కుటుంబ సభ్యులు మాంత్రికుడిని తీసుకురావాలని అతడిని కోరారు.

దీంతో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ తాలూకా సార్కనికి చెందిన మాంత్రికుడు అంబిహేకుమార్‌ను ఆదిలాబాద్‌కు రప్పించారు. దీంతో బాలిక ఆరోగ్యం కోసం పూజలు ఏర్పాటు చేశారు. అదే సమయంలో క్షుద్రపూజలు చేసేటప్పుడు రూమ్‌లో ఎవరూ ఉండకూడదని ఆ మాంత్రికుడు చెప్పడంతో అందరూ బయటకు వెళ్లిపోయారు. కొంత సేపటికి ఆ బాలిక కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు గదిలోకి వెళ్లిచూశారు.

అక్కడ ఆ బాలిక పట్ల మాంత్రికుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శుక్రవారం అంబిహే కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌‌కు పంపించారు. ఈ మేరకు పోలీసులు కొన్ని సూచనలు చేశారు. అనారోగ్యం బాగోలేకపోతే డాక్టర్‌కు చూపించాలని.. ఇలాంటి మాంత్రికులను నమ్మకూడదని తెలిపారు.

Also read

Related posts

Share this