ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణలు చేసిన బాధితురాలు హర్షవీణ ఎమ్మెల్యేకు సంబంధించిన మరో వీడియోను విడుదల చేసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న పోస్టులకు ఆమె కౌంటర్ ఇచ్చింది.
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్- మహిళా ఉద్యోగి వ్యవహారంలో కీలక పరిణామం వెలుగు చూసింది. ఎమ్మెల్యేపై అత్యాచారా ఆరోపణలు చేసిన బాధితురాలు అర్షవీణ తాజాగా మరో వీడియోను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోషల్ మీడియాలో తనపై వస్తున్న పోస్టులకు కౌంటర్ ఇచ్చింది. రోజు ఒక వీడియో వైరల్ చేస్తే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు శిక్ష పడుతుందని అనుకోవడం లేదని.. ఆయన ఏ రకంగా అమాయకుడో చెప్పాలని ప్రశ్నించింది.
మీ దృష్టలో ఏ తప్పు చేసినా దొరక్కుండా ఉండడమే అమాయకత్వమా?.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనుకుంటే రోజుకో అమ్మాయితో ఉండే స్థాయి అని పోస్ట్ పెట్టారు. చాలా మంది విలువలతో కూడిన నేతలు, మగవారు ఉన్నారు.కానీ వారంతా ఆయనలా లేరు అని చెప్పుకొచ్చింది. తాను మోసం చేయలేదని.. ఎమ్మెల్యేనే తనను మోసం చేసి ఇప్పుడు మాట్లాడటం మానేశాడని తెలిపింది. శ్రీధర్ జనవరి 7నే తనతో చివరిగా మాట్లాడారని ఆమె పేర్కొంది.
జనవరి 20 తర్వాత తాను మీడియా ముందుకు వచ్చానని.. హానీ ట్రాప్ చేయాని అనుకుంటే తనకు ఏడాదిన్నర సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదంది. ముక్కా రూపానంద రెడ్డి ఇంట్లో మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడారని..అలాంటి వ్యక్తి అమాయకుడు ఎలా అవుతాడని ప్రశ్నించింది. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే మహిళల గురించి కూడా ఎంత అసభ్యంగా మాట్లాడుతాడో తనకు తెలుసని చెప్పుకొచ్చింది.
తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగని.. తమది మంచి కుటుంబమని.. తన టైం బాగోలేక ఇలా అయ్యానని ఆమె చెప్పుకొచ్చింది. ఇది రాజకీయ కుట్రని ఒక వేళ ఇది హనీ ట్రాప్ అని ఆధారాలతో నిరూపిస్తే తానను చంపేయండి అని ఆవేదన వ్యక్తం చేసింది. 6 నెలలుగా వేధిస్తున్నా అని తనపై కేసు పెట్టారని.. ఎమ్మెల్యే ను వేధించే స్థాయి నాకుందా అని ప్రశ్నించింది. 6 నెలలుగా వేధిస్తుంటే ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది
Also read
- ఇద్దరు ప్రియురాళ్లను తీసుకుని వెళ్లి, దావత్ చేసుకున్న ప్రియుడు.. ఇంతలోనే షాకింగ్ ఘటన..!
- AP News: చోరి సొమ్ము వాటాల పంపిణీలో బెడిసిన యవ్వారం.. గ్యాంగ్ లీడర్ హత్య!
- అతనికి 24.. ఆమెకు 16.. ఇన్స్టాలో కలిశారు.. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలుసా..?
- హైదరాబాద్లో కల్తీ మాంసం రాకెట్ పై టాస్క్ఫోర్స్ దాడి..వెలుగులోకి షాకింగ్ నిజాలు! చూశారంటే
- నీచాతి నీచుడు వీడు.. దాగుడుమూతలు ఆడుకుందామని తీసుకెళ్లి..





