వేసవికాలం వచ్చిందంటే చాలు.. చాలా ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఎప్పుడూ ఒకేలా కాకుండా దొంగతనం చేయడంలో కూడా రూటు మారుస్తున్నారు కేటుగాళ్లు.. ఇంటికి తాళం వేసి కనపడితే చాలు.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా దొంగలు దొంగతనానికి పాల్పడుతున్నారు. ఎప్పుడూ ఒకే ఫార్మాట్‌లో కాకుండా వెరైటీగా దొంగతనం చేయాలని భావించారు ఈ దుండగులు.. ఇందు కోసం పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అనుకున్నదే తడువుగా తమ ప్లాన్‌ను అమలు చేశారు కూడా. దొంగతనానికి వెళ్లిన వారు దొంగతనం అనంతరం ఇంట్లో బండలపై కొబ్బరినూనె చల్లి.. అక్కడి నుంచి పరారయ్యారు.. ఫింగర్ ప్రింట్ సహా ఇతర ఆధారాలు దొరకకుండా దొంగలు కొత్త పంథాను ఎంచుకోవడం కలకలం రేపింది.. ఈ దొంగతనం ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే రెండు ఇళ్లలో చోరీ చేసి దుండగులు పరారయ్యారు. స్థానిక మెట్టి విధిలో నివాసం ఉంటున్న రైతు ఉస్మాన్ ఓ పెళ్లి కార్యక్రమం కోసం ఇంటికి తాళం వేసి హైదరాబాద్ పయనం అయ్యాడు. కొన్ని నిముషాల తరువాత ఉస్మాన్ కుమారుడు ఎదో వస్తువు కోసం తిరిగి ఇంటికి వెళ్లి చుస్తే అక్కడ ఇంటి తాళం తెరిచి ఉండటం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు.. వెంటనే తండ్రికి సమాచారం ఇవ్వడంతో ఇంటికి వచ్చి చుస్తే ఇంట్లో ఉన్న బీరువా తాళం పగలకొట్టి, లక్ష నగదు, మూడు తులాల బంగారు, 50 తులాల వెండిని.. దొంగలు అపహారించినట్టు గుర్తించారు.
అయితే.. ఇక్కడ మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది.. దొంగలు.. దొంగతనం అనంతరం ఇంట్లోనుంచి వెళ్లే సమయంలో ఇంట్లోఉన్న బండరాళ్లపై మొత్తం కొబ్బరి నూనెను చల్లారు. అలా ఇల్లు మొత్తం చల్లి వెళ్లిపోయారు. అయితే.. బాధితుడు ఉస్మాన్ ఫిర్యాదు మేరకు.. పోలీసులకు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి.. వివరాలు సేకరించారు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు
Also Read
- నేటి జాతకములు…11 జూలై, 2025
- Hindu Epic Story: స్వర్గాధికధిపతి ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
- Vipareeta Raja Yoga: నెల రోజులు చక్రం తిప్పేది ఈ రాశులవారే..! ఇందులో మీ రాశి ఉందా?
- నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష
- Andhra: వదినపై కన్నేసి సెట్ చేశాడు.. కానీ, మరిది అడ్డుగా ఉన్నాడని.. మాస్టర్ స్కెచ్.. చివరకు