ఆరుగురు ఆడపిల్లలను పొషించుకోవడానికి గంజాయి దందా మొదలెట్టింది ఓ జంట. ఈ వ్యవహారంలో పోలీసులు దంపతులను జైలుకు పంపడంతో లోకం తెలియని ఆడపిల్లలు దిక్కులేనివారయ్యారు. ఈ క్రమంలో జైలు నుంచి వచ్చిన తండ్రి.. మైనర్ కూతురి ప్రేమ విషయం తెలిసి రాడ్డుతో విచక్షణా రహితంగా కొట్టి చంపాడు. ఆనక మృత దేహాన్ని అడవిలో..
మైలవరం, సెప్టెంబర్ 11: ఆ తండ్రికి బాధ్యత అంటే ఏమిటో తెలియదు. అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని ఆరుగురు ఆడపిల్లలకు తండ్రయ్యాడు. మొదటి భార్యను వదిలేయడంతో ఆమె కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. రెండో భార్య వద్ద ఉంటూ ఆరుగురు ఆడపిల్లలను పొషించుకోవడానికి గంజాయి దందా మొదలెట్టాడు. ఈ వ్యవహారంలో పోలీసులు దంపతులను జైలుకు పంపడంతో లోకం తెలియని ఆడపిల్లలు దిక్కులేనివారయ్యారు. ఈ క్రమంలో జైలు నుంచి వచ్చిన తండ్రి.. మైనర్ కూతురి ప్రేమ విషయం తెలిసి రాడ్డుతో విచక్షణా రహితంగా కొట్టి చంపాడు. ఆనక మృత దేహాన్ని అడవిలో పడేశాడు. ఈ దారుణం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
ఐదు రోజుల క్రితం 14 సంవత్సరాల మైనర్ బాలిక మిస్సింగ్ పై బందువుల ఫిర్యాదు తో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసును చేదించారు. రెండు వివాహాలు చేసుకుని మైలవరం శుద్దిపేట ప్రాంతంలో నివాసముంటున్న చిందే బాజీ (46) మొదటి భార్య నాగమ్మ ద్వారా ఐదుగురు ఆడపిల్లలకు, రెండవ భార్య నాగేంద్రమ్మ ద్వారా ఒక ఆడపిల్ల గాయత్రి(14)కి జన్మనిచ్చాడు. రెండవ భార్యతో వివాహం తర్వాత బాజీతో విడిపోయి వేరుగా నాగమ్మ బ్రతుకుతుండగా.. బాజీ వద్ద ఐదుగురు ఆడపిల్లలు ఉంటున్నారు.
ఈ క్రమంలో రెండవ భార్యతో కలిసి గంజాయి విక్రయాలు చేపట్టి ఆ కేసులో బాజీ, నాగేంద్రమ్మ జైలుకెళ్లారు. నాగేంద్రమ్మ ఇంకా జైల్లోనే ఉండగా ఇటీవలే విడుదలైన బాజీ.. కుమార్తె గాయత్రి ఒక యువకుడితో ప్రేమలో పడిందని గమనించి హెచ్చరించాడు. వినకపోవడంతో ఇంట్లోనే తన ఐదుగురు కుమార్తెల సమక్షంలోనే గాయత్రిపై ఐరన్ రాడ్ తో దాడికి పాల్పడ్డాడు. దారుణంగా హతమార్చి మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేశాడు. సమచారం అందుకున్న పోలీసులు డ్రోన్లతో ఏపీ తెలంగాణ అటవీ సరిహద్దుల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు