February 3, 2025
SGSTV NEWS
Andhra Pradesh

ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా?



మరో పదేళ్ల పాటు ఏపీకి చంద్రబాబే సీఎంగా ఉండాలని పదేపదే చెబుతున్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. తాజాగా అల్లూరి ఏజెన్సీలో పర్యటించిన పవన్‌…మరోసారి సీఎం పోస్టుపై ఆసక్తికర కామెంట్లు చేశారు.


మరో పదేళ్ల పాటు ఏపీకి చంద్రబాబే సీఎంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పదేపదే చెబుతున్నారు.. తాజాగా మరోసారి సీఎం పోస్టుపై ఆసక్తికర కామెంట్లు చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, అల్లూరి జిల్లాలో పర్యటించారు. పాడేరు గిరిజన ప్రాంతాల్లో ఆయన టూర్‌ సాగింది. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశానికి స్థానిక నాయకులు, ప్రజలు భారీగా హాజరయ్యారు. అయితే పవన్‌ని చూసిన సంతోషంలో.. సీఎం సీఎం అంటూ అభిమానులు అరవడంతో ఆయన స్పందించారు. సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆయన్ని గౌరవించాలి అంటూ ఫ్యాన్స్‌కి నచ్చచెప్పారు పవన్‌ కల్యాణ్‌.


ముఖ్యమంత్రి పదవిపై మరోసారి పవన్‌కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎవరని కాదు, ఎవరు బాగా పనిచేశారన్నది ముఖ్యమన్నారు. చంద్రబాబుకు అపార అనుభవం ఉందని, తనకు డిప్యూటీ సీఎం ఇచ్చి గౌరవించారని పేర్కొన్నారు. మనసు బుద్ధి కలిస్తే, ఏపీ అభివృద్ధి అంటూ ఆసక్తికర కామెంట్లు చేశారు పవన్.

సీఎం ఎవరన్నది కాదు, ఎవరు బాగా చేశారన్నది ముఖ్యమంటూ .. పవన్‌ కల్యాణ్ చేసిన తాజా కామెంట్లు, ఏపీ పాలిటిక్స్‌లో మరోసారి ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి.

Also read

Related posts

Share via