ఇద్దరూ ప్రేమించుకున్నారు.. ఎవరికీ తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నారు.. కట్ చేస్తే.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం బయలుదేరారు.. ఇంతలోనే ఊహించని సీన్ ఎదురయ్యింది.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అసలేం జరిగిందంటే.. విజయవాడకు చెందిన ఓ ప్రేమ జంటను శుక్రవారం తిరుచానూరు పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన సాంబశివరావు, అలేఖ్య ఇద్దరూ ప్రేమించుకున్నారు.. ఈ క్రమంలోనే.. ఇద్దరూ రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు.. అనంతరం ప్రేమ వివాహం చేసుకున్నారు.
అలేఖ్య ఆచూకీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని భవానీపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. సాంబశివరావు, అలేఖ్య ఒక్కచోటనే ఉన్నారన్న విషయం తెలిసింది. వారు.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్తున్నట్లు భవానీపురం పోలీసులకు సమాచారం అందింది.. వెంటనే.. భవానీపురం పోలీసులు తిరుచానూరు పోలీసులను అప్రమత్తం చేశారు. ఇద్దరి గురించి సమాచారం అందించారు.. వాహనంలో అలేఖ్య, సాంబశివరావు ఇద్దరూ వస్తుండగా పోలీసులు తిరుచానూరు సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భవానీపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా.. తాము ప్రేమించి పెళ్లిచేసుకున్నట్లు అలేఖ్య సాంబశివరావు తెలిపారు. తాము ఇద్దరం 11 ఏళ్లుగా ప్రేమించుకున్నట్లు అలేఖ్య తెలిపింది.. మేజర్లమైన తాము ఇష్టప్రకారమే వివాహం చేసుకున్నామని, పోలీసులు రక్షణ కల్పించాలంటూ కోరారు..
తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్ మాట్లాడుతూ.. వీరిద్దరిని భవానీపురం పోలీసులకు అప్పగిస్తామని తెలిపారు. కాగా.. నూతన వధూవరులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది
Also read
- సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో శుభఫలితాలు పొందండి!
- ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం.. మీరున్నారా?
- Hyderabad: ప్రేమ పేరుతో వల.. ఐదుగురు యువతులతో వ్యవహారం.. మైనర్‌పై దారుణం!
- నాన్న నేనేం తప్పు చేశాను.. ఎందుకు నన్ను చంపేశావ్.. ఒంగోలులో గుండెల్ని పిండేసే ఘటన..
- జర్నలిస్ట్ ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో కలకలం





