తాడేపల్లిగూడెంలో శేఖర్ అనే వ్యక్తి భార్య ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చింది. మరోసారి గల్ఫ్ వెళ్తానంటే శేఖర్ నిరాకరించారు. భార్యను భయపెట్టాలని తాను పురుగుల మందు తాగడంతో పాటు కొడుకు సాత్విక్‌కు కూడా తాగించాడు. దీంతో చికిత్స పొందుతూ సాత్విక్ మృతి చెందాడు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణ ఘటన జరిగింది. భార్యపై కోపంతో ఓ తండ్రి కొడుకు ప్రాణం తీసిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే తాడేపల్లిగూడెంలో శేఖర్ అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇతని భార్య ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చింది. మరోసారి గల్ఫ్ వెళ్తానంటే శేఖర్ నిరాకరించారు. ఎలాగైనా ఆమె వెళ్తానని అనడంతో.. భార్యను భయపెట్టాలని కొడుకుని బలి చేశాడు. నిన్ను ఎలా ఆపాలో తెలుసంటూ.. శేఖర్ పురుగుల మందు తాగడంతో పాటు కొడుకు సాత్విక్‌కు కూడా తాగించాడు. దీంతో చికిత్స పొందుతూ సాత్విక్ మృతి చెందాడు. ప్రస్తుతం శేఖర్ పరిస్థితి కూడా విషమంగా ఉంది.
భార్య సరిగ్గా వంట చేయలేదని..
ఇదిలా ఉండగా ఇటీవల భార్య వంట సరిగా చేయలేదనే కోపంతో భర్త నరికి నరికి చంపాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మాగడి సమీపంలోని మత్తికెరెలో రంగయ్య (68), తిమ్మమ్మ (65) దంపతులు ఎన్నో ఏళ్లుగా కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తరచూ వీరి మధ్య చిన్న చిన్న మనస్పర్థాలు జరుగుతుండేవి. ఒక్కోసారి గొడవలు కూడా పడేవారు.
అయితే బుధవారం రాత్రి వంట చేసే విషయంలో భార్య తిమ్మమ్మతో భర్త రంగయ్య గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ కాస్త పెద్దదిగా మారడంతో ఆమెపై దాడి చేశాడు. కొబ్బరి తురిమే పీటతో నరికి హత్య చేశాడు. అనంతరం ఆ రాత్రి ఇంట్లోనే ఉండి.. గురువారం ఉదయం తిరుపతికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిని రామనగరలో మాగడి పోలీసులు అరెస్టు చేశారు.
Also read
- గ్లిజరిన్ వేసుకుని ఏడ్చినట్లు నమ్మించిందా?.. తేజేశ్వర్ హత్య కేసులో కొత్త అంశం
- Tadipatri: వేట కొడవలితో దాడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
- Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం.. కుమారుడిని చంపి కాలువలో పూడ్చేసిన తండ్రి
- Crime News: ప్రియుడితో కలిసి భర్తను చంపించి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
- నేటి జాతకములు..16 జూలై, 2025