– స్కామ్ బయటపడడంతో సాధారణ ఉద్యోగిని ఇరికించిన కోట రుక్మిణీ అండ్ గ్యాంగ్
జనసేనాని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ కమ్ పీఏ కోట రుక్మిణి అవినీతి బండారం బయట్టబయలు అయ్యింది.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సన్నిహితురాలు కోట రుక్మిణీ అండ్ టీమ్ కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేశారు.
స్కామ్ బయటపడడంతో ఈ కుంభకోణం నుంచి తప్పించుకునేందుకు అధికార బలాన్ని ఉపయోగించి, తమ సంస్థలో సాధారణ ఉద్యోగిగా పనిచేసిన బోడపాటి ధరణి కృష్ణను బలిపశువును చేయడానికి సిద్ధపడ్డారు.
బాధితురాలు ధరణి కృష్ణ వీడియో, ఆమె తల్లి గార్గ నాగమణి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌తో జనసేన నాయకురాలు కోట రుక్మిణీ అవినీతి భాగోతం బయటపడింది.
ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కల్యాణం శివ శ్రీనివాసరావు (కేకే), సంస్థ డైరెక్టర్‌గా ఉన్న కోట రుక్మిణి, పెద్దిరాజు కలిసి నిరుద్యోగుల నుంచి దాదాపు రూ.7 కోట్లు వసూలు చేశారు.
ఈ వ్యవహారం బయటపడడంతో కోట రుక్మిణి ఈ కేసు నుంచి బయటపడేందుకు, తన వద్ద కేవలం ‘హెచ్‌ఆర్ అండ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్’గా పనిచేసిన ధరణి కృష్ణను ఇరికించారు.
సంస్థలో ఉద్యోగి అయిన ధరణికి ఎలాంటి వాటాలు గానీ, డైరెక్టర్ పదవి గానీ, యాజమాన్య హక్కులు గానీ లేవని ఆమె స్పష్టం చేస్తూ, తన కుమార్తెకు న్యాయం చేయాలని కోరుతూ ధరణి కృష్ణ తల్లి నాగమణి హైకోర్టును ఆశ్రయించారు.
నవంబర్ 11న అరగంట వ్యవధిలోనే కేకే ఇచ్చిన ఫిర్యాదుతో, కోట రుక్మిణి ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో మరొకటి చొప్పున రెండు కేసులు నమోదయ్యాయి.
ఈ రెండింటిలోనూ అసలు నిర్వాహకులను కాకుండా సాధారణ ఉద్యోగి అయిన ధరణి కృష్ణనే ప్రధాన నిందితురాలిగా (A1) చేర్చింది కోట రుక్మిణీ గ్యాంగ్
జనసేన నాయకుల ఒత్తిడితో పోలీసులు తనను అన్యాయంగా అరెస్టు చేసి, మంగళగిరి రూరల్ పీఎస్, హైదరాబాద్, గుంటూరు సీసీఎస్ చుట్టూ తిప్పుతూ దారుణంగా కొట్టారని ధరణి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
కేకేకు పార్టీలో కొందరితో ఉన్న విభేదాల కారణంగా, వారికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇప్పించేందుకు పోలీసులతో తనను కొట్టించి కేకే వీడియో తీయించారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
పవన్ కళ్యాణ్ అండదండలతోనే కోట రుక్మిణి అండ్ గ్యాంగ్ కోట్ల రూపాయల స్కామ్‌లకు తెగబడింది. స్కామ్ బయటపడడంతో అధికారాన్ని ఉపయోగించుకొని అమాయక ఉద్యోగిని ఇరికించి తప్పుకుంటున్నారు.
మరోవైపు, ఈ వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ జరిపి అసలు సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.
Also read
- టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి పై ఏసీబీ పంజా.. అక్రమాస్తులు చూస్తే మీ మైండ్ బ్లాకే?
- అత్తతో చిన్నపాటి వివాదం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య!
- వేళ్లన్నీ కోట రుక్మిణీ వైపే – ఉద్యోగాల పేరుతో రూ.కోట్లు వసూలు చేసిన పవన్ సన్నిహితురాలు
- విశాఖలో కి’లేడీ’.. ఘరానా చోరీ
- యువకుడిపై కత్తిపోట్ల కలకలం..! విచక్షణారహితంగా దాడి..





