మానవత్వాన్ని మరచి చెడు వ్యసనాలకు బానిసలై అనాలోచనతో పేగు బంధాలనే తెంచివేస్తున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన వరుస ఘటనలు కంటతడి పెట్టిస్తున్నాయి. అయ్యో పాపం అనే ఎలా చేస్తున్నాయి. కాలం మారిపోతుందంటూ చర్చించుకునేలా చేస్తున్నాయి.
మద్యానికి బానిస అయిన ఉన్మాదులు సొంత వాళ్లను కూడా కనికరం లేకుండా కడతేరుస్తున్నారు. ఒకే కడుపులో పుట్టిన అన్నదమ్ములు బద్ద శత్రువులుగా మారి ప్రేమ అభిమానాలను సైతం కాదనుకుంటున్నారు. మద్యం మత్తులో సొంత తమ్ముని హతమార్చాడు ఒక కిరాతకుడు అన్నయ్య. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అనుగొండ గ్రామంలో చోటు చేసుకుందీ ఘటన. చిన్నపాటి గొడవకే సొంత తమ్ముడిని హతమార్చిన అన్న
అన్నదమ్ముల మధ్య 9 సెంట్లు కల్లం దొడ్డి స్థలం కోసం కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే తమ్ముడు బోయ మానికింద వెంకట్రాముడు ఇంటి దగ్గర ఉన్న కళ్ళం దొడ్డి కోసం అన్న బోయ మానికింద భాస్కర్ పట్టుబట్టాడు. ఇదే విషయమై తల్లి వెంకటేశ్వరమ్మతో వెంకట్రాముడు మాట్లాడుకుంటూన్న సమయంలో, మద్యం మైకంలో వచ్చిన భాస్కర్ వాగ్వివాదానికి దిగాడు. మాటా మాట పెరగడంతో పక్కనే ఉన్న ఇనుప రాడ్‌తో వెంకట్రాముడి తలపై భాస్కర్ వేయడంతో ఒక్కసారి కుప్పకూలి కింద పడిపోయాడు. తీవ్ర రక్తస్రావం గాయాలైన వెంకట్రాముడు అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారించి హత్య కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న భాస్కర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన వెంకట్రాముడికి భార్య శోభ, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. భర్త చనిపోయి ముగ్గురు ఆడపిల్లలను ఎలా పోషించుకోవాలని దిక్కుతోచని స్థితిలో పడిపోయింది వెంకట్రాముడి భార్య శోభ
Also read
- చెంబులో ‘కీ’… అదే కలిసొచ్చింది దొంగలకి
- ఫేస్ బుక్ లో వల.. సహజీవనం తర్వాత అసలు రంగు!
- భర్త కువైట్‌లో.. భార్య కడపలో.. డ్రైవర్‌తో అలా కనిపించే సరికి..
- విశాఖ ప్రమాద బాధితులకు కోటిరూపాయల పరిహారం ఇవ్వాలి…… గ్రీష్మ కుమార్ ఐ.యఫ్.టీ.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..





